నేను అనుకున్నఈ గ్రాఫిక్ కాలంలో ఉలి చిలుంపట్టి శిల్పి బక్కచిక్కి శిల్పకళ కనుమరుగైందేమోనని..
కాని ఆశ్చర్యం! నవ్య యాదాద్రీశుని ఆలయ ప్రాంగణంలో అడుగిడితే..
నా చూపులు గజ తురగ పదాతి దళ కవాతుల కలువ కమల దళాకృతుల అర్ధనారీశ్వరుల తాండవ కేళీ పదలయగతుల నందీశ్వర ప్రమథనాథ గళ ఘంటికల నర్తకీమణుల నవరస నాట్య భంగిమల వెంట పరిగెత్తాయి..
మేలి ముసుగును మేని మడతను కంటి కొలకును కాలి మువ్వలను కంఠా భరణముల కరకంకణముల కళాకృతులలో లీనమైపోయాయి.
నేమన్న పాండ్య చోళ కాకతీయుల కాలంలో ఉన్నానా?! అనేల భ్రమింపచేసాయి…
నిజంగా తరచినకొలదీ..ఎద తలుపులు తెరచే..రాతిపుటల గ్రంథాలయం నేటి మన యాదాద్రి గుడి గోపురం నిష్ణాత శిల్పకళా నిపుణులకిదే..నా కవన నీరాజనం
–మల్యాల మనోహరరావు 81605 42095