ఆయనకు అందరూ శత్రువులే
ఇప్పుడు నేనూ-
శత్రుత్వం లేనిది ఎవరికీ ?
అందరూ అందరికీ మిత్రులైనట్టు-
అజాతశత్రువులూ లేరు
అజాత మిత్రులూ ఉండరు
వెలుగు వెంట నీడ
సుఖం వెంట దుఃఖం
పుట్టుక వెంట చావు
ఒక చీకటి
ఒక వెలుతురుకు దారితీస్తుంది
ఒక విచారం
ఒక ఆనందానికి కారణమవుతుంది
ఒక చావు
ఒక పుట్టుకకు మూలమవుతుంది
ఒక జీవికైనా
ఒక ఉద్యమానికైనా –
-కందుకూరి శ్రీరాములు: 94401 19245