లాకప్ డెత్.. పోలీసులకు ఉరిశిక్ష
భారత్‌లో కేసులు కడదాకా కొనసాగి బాధ్యులైన పోలీసులకు శిక్షలు పడిన సంఘటనలు బహుఅరుదుగానే ఉంటాయి. అలాంటి అరుదైనవాటిలో కీలకమైందిగా తమిళనాడు శాతాంకుళం (సైతాను కుంట అని అర్థం) కస్టడీ మరణాల కేసు నిలుస్తుంది.
భారత్‌లో కేసులు కడదాకా కొనసాగి బాధ్యులైన పోలీసులకు శిక్షలు పడిన సంఘటనలు బహుఅరుదుగానే ఉంటాయి. అలాంటి అరుదైనవాటిలో కీలకమైందిగా తమిళనాడు శాతాంకుళం (సైతాను కుంట అని అర్థం) కస్టడీ మరణాల కేసు నిలుస్తుంది. ప్రపంచం కరోనా కల్లోలంతో కకావికలవుతున్న రోజుల్లో 2020 జూన్‌లో ఇది జరిగింది. ఇద్దరు తండ్రీకొడుకులను పోలీసులు పట్టుకుపోయి లాకప్ లో చిత్రహింసలు పెట్టి ఉసురు తీశారు. ఇంతకూ వారు దొంగలో, అక్రమ రవాణాదారులో, వైట్ కాలర్ నేరస్థులో కాదు. కరోనా లాక్డౌన్ గడువులోగా తమ మొబైల్ షాపు మూయకపోవడమే వారు చేసిన నేరం. ఈ కేసులో విచారణం కాలంలో చనిపోయిన వ్యక్తిని మినహాయించి మిగిలిన తొమ్మిది మంది పోలీసులకు విచారణ కోర్టు విధించిన మరణశిక్షను మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ధ్రువీకరించడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ముందుగా తండ్రి పి.జయరాజ్ (58)ను అరెస్టు చేసి తీసుకుపోయారు. అతడిని లాకప్ లో దారుణంగా కొడుతుంటే కొడుకు జే.బెన్నిక్స్ అడ్డుచెప్పాడు. దాంతో అహం దెబ్బతిన్న పోలీసులు అతడినీ ’లోపల వేసి’ తమ ప్రతాపం చూపారు. అంతిమంగా తండ్రీకొడుకులు శవాలై మిగిలారు. ఈ మరణాలు జ్యుడీషియల్ కస్టడీలో జరగడం ఘోరం. ఈ ఘటన పౌరసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై రాజకీయంగానూ ఇది పెద్ద దుమారమే రేపింది. చివరకు ఐక్యరాజ్య సమితి వరకూ ఈ కేసు ప్రకంపనలు వినిపించాయి.
శిక్షలపై అపీలు చేసుకునేందుకు కోర్టు దోషులకు అవకాశం ఇచ్చింది.
వాటిపై న్యాయ నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం. కస్టడీ మరణాలకు దారితీసే పోలీసు కర్కశత్వానికి శాతంకుళం తీర్పు ఓ హెచ్చరికగా పని చేస్తుందని న్యాయకోవిదులు నమ్ముతున్నారు. నిజానికి ఈ కేసు కూడా అనుమానాస్పద మరణాల జాబితాలో చేరిపోయి అటకెక్కి ఉండేది. బాధితులు సాగించిన అలుపెరుగని న్యాయపోరాటం, చివరి వరకూ చెక్కుచెదరకుండా నిలిచి, అండదండలు అందించిన సాక్షులు ఈ అంతిమ విజయానికి కారకులని చెప్పాలి. న్యాయవ్యవస్థ అప్రమత్తతతో పాటుగా ఈ కేసులో ముఖ్యంగా చెప్పుకోదగిన అంశం మహిళా హెడ్ కానిస్టేబుళ్లు రేవతి, సెల్వకుమారి తమ తోటి సిబ్బందికి వ్యతిరేకంగా చెప్పిన సాక్ష్యం.
పోలీసులు స్టేషన్లో జరిగిన లాకప్ డెత్ సాక్ష్యాలను తారుమారు చేస్తారని అనుమానించిన న్యాయాధికారులు ఆ ప్రాంగణాన్ని రెవెన్యూ విభాగం అధికారుల పర్యవేక్షణలో ఉంచడం గమనార్హం. అయినప్పటికీ ముందుగానే చాలావరకు ఆధారాలను నిర్మూలించగలిగారు. కానీ హెడ్ కానిస్టేబుళ్ల బలమైన సాక్ష్యం మొత్తం కథను మలుపు తిప్పడం ఈ కేసు ప్రత్యేకతగా నిలిచింది. వారి ధైర్యాన్ని అభినందించక తప్పదు.
నిరాయుధులైన తండ్రీకొడుకులను నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపిన పోలీసు సిబ్బంది అరుదైన మరణశిక్షకు ఎంతైనా అర్హులని కోర్టు తేల్చిచెప్పింది. నేరస్థులను న్యాయశిక్షలు సంస్కరించాలా లేక ఉసురు తియ్యాలా అనే చర్చ చాలా పాతది. ఈ కేసులోనూ మరణశిక్షలు విధించడాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తన విధానాల మేరకు వ్యతిరేకించింది. ఆ తరహా యుక్తాయుక్త విచక్షణను అలా ఉంచుదాం. ప్రపంచంలో ఇప్పటికీ పెద్దసంఖ్యలో కస్టడీ మరణాలు చోటు చేసుకునే దేశాల్లో భారత్ ఉండటం విచారకరం. 2020-21లో 1940 కస్టడీ మరమాలు సంభవిస్తే 2021-22లో ఆ సంఖ్య 2544కు పెరిగింది.
ఇందులో సింహభాగం దేశంలోనే అతిపెద్ద రా్రష్ట్రమైన యూపీలో చోటుచేసుకోవడం అక్కడి పోలీసు వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతున్నది. కస్టడీలోకి తీసుకోవడం, అరెస్టు చేయడం వంటివి పోలీసు విధినిర్వహణలో తప్పనిసరి అంశాలుగా ఉండవచ్చు. కానీ స్టేషన్ నాలుగు గోడల మధ్య విచారణ పేరిట జరిగే హింస అసలు సమస్య. ఆ హింస మరణానికి దారితీస్తే ఏమిటనేది ఇంకా పెద్ద సమస్య. ఉరిశిక్షా, మరో శిక్షా ఆనేది వేరే విషయం. వీడియోగ్రఫీ, ఆరోగ్య పర్యవేక్షణ వంటి వ్యవస్థల చేర్పుతో పాటుగా జవాబుదారీని నిర్ధారించే కట్టుదిట్టమైన నిబంధనలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పేవారికి తగిన రక్షణ కల్పించడమూ ముఖ్యమే.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

