ఆలోచనలు గొప్పగా ఉంటేనే మనం కూడా ఆ స్థాయిని అందుకుంటామని నిరూపించారు సీఎం కేసీఆర్. సంపదను సృష్టించే పద్ధతుల గురించి పద్దులు వేస్తూ కూర్చుంటే పనులు కావు, పనులు ప్రారంభిస్తే కదా ముందుకు ఎలా వెళ్లాలో తెలిసేది. ఇదే విధానాన్ని తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తునకగా చేసేందుకు అమలుచేశారు కేసీఆర్. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ అనే పుస్తకంలో ఎన్నో ఆర్థికపరమైన పా ఠాలు మనం చూడవచ్చు. అందులో ధనవంతులు సంపాదించుకోవడం కోసం పనిచేయరు. పని పెట్టు కొని డబ్బు సంపాదిస్తారు. కానీ, ఇక్కడ మన ముఖ్యమంత్రి కేసీఆర్ సంపదను మనమే సృష్టించుకోవాలని చెప్తుంటారు. అందుకే ఆయనను ‘తెలంగాణ రిచ్ డాడ్’ అని పిలుచుకుంటాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు గొప్పగా, పెద్ద గా, భవిష్యత్తుతరాలకు ఉపయోగపడేలా ఉంటాయి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద బడ్జెట్ చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ, ఇక్కడ ప్రాజెక్టులు, పథకాల అమలును చేసి చూపించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచనా విధానాలను అమలు చేస్తే సంపదను మనం కూడా సృష్టించగలమని నిరూపిం చారు. ముఖ్యంగా మిషన్ భగీరథ పథ కం అమలు కోసం సీఎం కేసీఆర్ చేసిన ఓ అద్భుతమైన ఆలోచన ఇప్పుడు ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నది.
అందుకే ఆయనను అపర భగీరథుడని అంటాం. ఇక్కడ ఆయన ప్రాజెక్టుకు ఆయ్యే ఖర్చు గురించి ఆలోచించలేదు. ప్రాజెక్టు ఎంతమంది ప్రజలకు ఉపయోగపడుతుందనే విషయాన్ని దూరదృష్టితో చూశారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును మనమే సృష్టించుకోవాలని, సృష్టించగ లమని నిరూపించారు. ఇప్పడు రాష్ట్రంలో ఏ ఇంటికి వెళ్లినా మిషన్ భగీరథ పైపులు దర్శనమిస్తుంటాయి. దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు సంపదను సృష్టించడంలో మన ముఖ్యమంత్రి ఎంతటి సమర్థుడోనని.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు ముందునుంచే ఎంతో గొప్పగా ఉంటాయి. తెలంగాణ పాలనా సౌధమైన సచివాలయాన్ని పుననిర్మించడంలోనూ విజయవంతమయ్యారు. చాలీచాలని గదులతో ఉండే సచి వాలయం స్థానంలో రాష్ట్రంలో నుంచి వచ్చే ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా నిర్మాణం చేపట్టి పూర్తిచేశారు. ఈ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం అని నామకరణం చేశారు. ఆ పక్కనే గతంలో ఎన్నడూ లేనివిధంగా 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని నిర్మించి, ఆవిష్కరించారు. మన ఆలోచనలకు పదునుపెడితే ఎంత టి సమస్యనైనా ఎదురించి, పరిష్కరించుకోవచ్చని చెప్తుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏదైనా పనిని మొదలు పెట్టిన ప్పుడు అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుందని చూ సుకోవాలి. డబ్బు మన కోసం పని చేయాలి కానీ, డబ్బు కోసం మనం పని చేయకూడదంటారాయన. చేసే పని ఆదాయాన్ని సృష్టించేలా చేయాలంటారు. ఆర్థిక విలువలకు చోటు ఇస్తూనే సంపద ఎలా సృష్టించుకోవచ్చనే విషయాన్ని సీఎం కేసీఆర్ను చూసి నేర్చుకోవచ్చు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ప్రాజెక్టు ప్రారంభించినా దానికి సంబంధించిన వ్యూహాలను సన్నిహిత నాయకులు, సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. ఇది సాధ్యం కాదన్నవారు కూడా ముక్కున వేలేసుకునేవిధంగా వ్యూహరచనలు రూపొందిస్తారు.
లోటుబడ్జెట్ అన్న వారి నోటితోనే ‘ఆర్థిక బాంధవుడు’ అని పిలిపించుకునే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టులోనైనా, పథకంలోనైనా ఇప్పటివరకు వెనుకడుగు వేసింది లేదు. పని ప్రారంభించే ముందు లెక్కలు వేసుకోవడం ఆయనకు అలవాటు లేదు. పని మొదలుపెట్టి దాని కోసం సంపదను సృష్టించాలని చెప్తారు. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ‘తెలంగాణ రిచ్డాడ్’ అయ్యారు.
ముచ్చటగా మూ డోసారి ఎన్నికల బరిలో దిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో లో చెప్పిన పథకాలకు బడ్జెట్ ఎ లా తీసుకువస్తారని ప్రశ్నించే ప్రతి పక్ష నాయకులకు ఇం కా అర్థం కాని వి షయమే ఆయన ఆలోచనలు. సం పదకోసం వెతుక్కోవడం కాదు, సంపదను సృష్టి ంచుకోవాలనే ఆలోచనా విధానాలే తెలంగాణ రిచ్డాడ్
ప్రత్యే కం.
-రాపల్లి శోభన్ కుమార్
97055 54437