పల్లెలిప్పుడు పచ్చని కొంగును
ధరించినట్లు పరవశించి పోతున్నయి.
తెలంగాణం అంతా ఆకుపచ్చని తోరణాలతో
అలంకరించినట్లు ముస్తాబవుతుంది.
హరితహారం ఇపుడు తెలంగాణ తల్లి
మెడలో పచ్చలహారం.
ప్రకృతి అంతా ఆకుపచ్చని అమ్మలా మారి
పశుపక్ష్యాదులు జంతుజాలాన్నంత
అక్కున చేర్చుకుంటుంది.
చంద్రశేఖరుడి కృషితో.. పుడమి తల్లి ఎదపై
తరువులన్నీ ఉదయిస్తున్నయి.
ప్రాణవాయువులను పంచుతున్నయి.
కొత్త వేపకొమ్మలన్ని కుండలో బోనమై
అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నయి.
చెట్లన్నీ పుడమి చుట్టూ కంచెలా మారి
రక్షక కవచాలయి నిలబడుతున్నయి.
ఊరువాడంత ఆకుపచ్చని పండగే.
ఒకప్పుడు రాళ్లురప్పలై దర్శనమిచ్చిన
అరణ్యాలన్నీ..
దట్టమైన వృక్షాలతో కళకళలాడుతున్నయి.
గగనాంతరము నుండి వారిజములు
వానజల్లులు కురిపించగా
స్వచ్ఛమైన చిరుజల్లులన్ని
గంగాధరుడుకి అభిషేకం చేసినట్లు
పుడమితల్లి తడిసిపోతుంది
తుషారబిందువుల తాకిడికి
సేను సెలక పరవశించిపోతుంది.
అశోక్ గోనె
9441317361