బ్రదుకు కాలి,
పనికిమాలి,
రేవంత్ రెడ్డి,
శని దేవుడి రథచక్రపు
టిరుసులలో పడి నలిగిన
దీనులార !
హీనులార !
కూడు లేని, గూడు లేని
పక్షులార ! భిక్షులార !
ఏడవకం డేడవకండి !
మీరక్తం, కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం డేడవకండి.
ఓ బాధాసర్పదష్టులార !
ఏడువకం డేడవకండి !
వస్తున్నా యొస్తున్నాయి…
కేసీఆర్ గారి జగన్నాథ, జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్ !
జన్నాథుని రథచక్రాల్ !
తెలంగాణకై పురుడు పోసుకున్న ఉద్యమానికి రజతోత్సవాలను ఈ నెల 27న వరంగల్‌లో జరుపుకునే శుభ వేళలో అశేష జన సందోహానికి ఊపిరినిచ్చే కేసీఆర్ గారి జగన్నాథ రథచక్రాలు కదం తొక్కనున్నాయి. నమ్మి భంగపడ్డ తెలంగాణ సమాజానికి కాలంతో పాటు మంచి రోజులు రానున్నాయని రజతోత్సవాలు శ్రీకారం చుడుతాయని సమస్త తెలంగాణ వేయి కళ్లతో ఎదురుచూస్తుంది.
ఆగస్టు 15, 1947 భారతీయులకు ఎంతో పవిత్రమైన రోజు, కొన్ని శతాబ్దాల పాటు బానిస సంకెళ్ల చప్పుల మధ్య పగిలిన గుండెలను చూసిన రోజుల నుంచి స్వేచ్ఛా వాయువులను పీల్చుకునే మొదటిరోజుగా అందరికీ గుర్తుంటుంది. తరాలు మారిన స్వాతంత్ర్యం లభించిన రోజు విదేశీ పాలనలో గత చీకటి రోజులను తలుచుకుంటున్నాం. దేశ స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు నడిచాయి. ఎంతోమంది దేశ నాయకులు చివరి రక్తం బొట్టు వరకు పోరాడారు. ఇది చరిత్ర, స్వాతంత్ర పోరాటాన్ని కొంతమంది వక్రీకరించిన అంతిమంగా ఏదో ఒకరోజు నిజం నిర్భయంగా బయటకు వస్తుంది.
జూన్ 02, 2014 కేసీఆర్ చెప్పినట్లు ఆరు శతాబ్దాల పాటు చిధ్రమైన తెలంగాణ మళ్ళీ పురుడు పోసుకుంది. కానీ తెలంగాణ స్వరాష్ట్రం కంటే ముందు ఉన్న దుస్థితి గురించి ముందు తరాలకు చెప్పకుంటే చారిత్రక తప్పిదం అవుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన బానిస సంకెళ్లు తెగిని ప్రాంతం తెలంగాణది. పాలన మారినా అర్థ శతాబ్దిపైగా రక్తపుటేరులతో, ఆకలి మంటలతో దినదిన గండంగా చావు బ్రతుకుల మధ్యన జీవన పోరాటం సాగించిన తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ చరిత్ర భారత స్వతంత్ర పోరాటానికి ఏమాత్రం తీసిపోనిది.
దేశ స్వాతంత్ర పోరాటంలో ఎందరో నాయకులు చివరి శ్వాస వరకు పోరాటం చేశారు. కానీ తెలంగాణ పోరాట చరిత్రలో ఆదిలో ప్రారంభమైన పోరాటం అనేక కుట్రలతో మధ్యలో ముగిసిపోయిన ఘట్టాలు అనేకంగా ఉన్నాయి. తెలంగాణ భౌతిక స్థితితోపాటు పోరాట చరిత్రను గమనిస్తే ఏడు తరాల నవల గుర్తుకొస్తుంది. రాజకీయ క్రీడలో ఆగమైపోతున్న తెలంగాణను విముక్తి చేసిన ఉద్దండడు కేసీఆర్ తెలంగాణ చరిత్రను గమనిస్తే కేసీఆర్ గారికి కు ముందు కేసీఆర్ గారి తర్వాత అని చరిత్ర పాఠాలుగా చెప్పవచ్చు.
తెలంగాణ చరిత్రలో అభివృద్ధి కంటే తెలంగాణ ప్రజానీకానికి అన్యాయం చేసిన చరిత్రనే అధికంగా ఉంటుంది. ఆది నుంచి తెలంగాణపై కుట్రల కొనసాగింపు సాగుతూనే ఉంది. ఆ కుట్రల ఫలితమే నేడు ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రమాదం సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఇది ప్రమాదం కాదు, ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణకు స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేయడం లాంటిది. ఇది ముమ్మాటికి పాపం తెలంగాణ వ్యతిరేకులతో పాటు తెలంగాణలో ఉండి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే చిత్తశుద్ధి లేని నాయకులదే అవుతుంది.. ఎస్ఎల్బీసీ గురించి కేసీఆర్ గారు గతంలోనే చెప్పాడు ఇప్పుడు అక్షర సత్యం అయింది. సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో వనరులు ఉన్నా కుట్రలకు బలి అయినా తెలంగాణను నిద్రలేపిన నాయకుడు కేసీఆర్ గారు ఒకరకంగా చెప్పాలంటే చీకటిలో మగ్గుతున్న తెలంగాణకు టార్చి బేరర్‌గా మారి వెలుగులు నింపాడని చెప్పవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉంది అంటే అది కేసీఆర్ గారి పుణ్యమే. ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యత కలిగిన బాహుబలి, మెగా బాహుబలి మోటార్లను తెప్పించి పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులతో తెలంగాణను సస్యశ్యామలం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తుంపర సేద్యం తప్ప మరే ఏ అవకాశం లేదని వరి మాగాణి వేయొద్దని కుట్రలో భాగంగా తెలంగాణ రైతులను కూడా కూలీలుగా మార్చిన నాయకుల వారి కళ్ళముందే గోదావరి, కృష్ణ, తుంగభద్ర జలాలను బీడు పొలాలలో పరుగులు పెట్టించి వ్యవసాయాన్ని పండుగగా చేశాడు. ఈ రోజు తెలంగాణలో ఆయిల్ ఫామ్ మామిడి తోటలతో పాటు దక్షిణాది రాష్ట్రాలలోనే అత్యధిక వరి ధాన్యం పండించిన రాష్ట్రంగా రికార్డులోకి ఎక్కిందంటే తెలంగాణపై కేసీఆర్ గారి చిత్తశుద్ధి అద్దం పడుతుంది. చీకటిలో ఉన్న తెలంగాణ పల్లెలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే విద్యుత్ వెలుగులో వచ్చాయంటే కేసీఆర్ గారికి తెలంగాణ పట్ల ఉన్న అంకుడిత దీక్ష అర్థం చేసుకోవచ్చు.
పదేళ్ల తెలంగాణ మునుపటి స్థితికి వచ్చిన తరుణంలో జరుగుతున్న పార్టీ రజతోత్సవాల సందర్భంగా కేసీఆర్ గారు తెలంగాణ గోసను వివరించడంతో కన్నీళ్లు ఆగలేదు. అవును తెలంగాణ స్వరాష్ట్రం కోసం సర్వస్వమును కోల్పోయిన త్యాగధనుల జీవితాలను వెల కడుతున్న నేటి తరాణంలో జరుగుతున్న రజతోత్సవాలు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణకు ఎలా అంకితమై పని చేయాలో కేసీఆర్ గారు చేసిన దిశా నిర్దేశం తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా మారుతుంది. పది వసంతాల తెలంగాణ రాష్ట్రంలో అన్నపూర్ణ దేవి ధాన్యం రాశులతో కలకలళాడింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ పది ఏళ్లపాటు స్వర్ణ యుగాన్ని తలపించింది. తెలంగాణ ఉద్యమ కాలంలో అమెరికా గడ్డపై నుంచి కేసీఆర్ గారి స్ఫూర్తితో ఉద్యమాలు నడిపించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యమైనందుకు నేడు గర్వపడుతున్నాను.
తెలంగాణ ఆది నుంచి దోపిడికి గురైంది. దేశంలోనే అత్యంత దోపిడికి గురైన ప్రాంతాలలో తెలంగాణ ఒకటిగా ఉండేది. కట్టు బానిసలుగా బ్రతికిన తెలంగాణలో పరాయి పాలన నుంచి విముక్తి లభించిన స్వదేశీ స్వార్థపరుల పాలన నుంచి విముక్తికి నోచుకోలేక గోసకు గురైంది. కూత వేటు దూరంలో నీళ్లు ఉన్న గొంతు తడవని రోజులను తరాల నుంచి చూసి గోస అనుభవించాం. వరి బువ్వ నోచుకోని తెలంగాణలో పరాయి గడ్డలపై వలస కూలీలుగా వెళ్లి బాధాకరమైన బ్రతుకులను కొనసాగిస్తున్న తెలంగాణ ప్రజల విముక్తి కోసం చిన్ననాటి నుంచి ఆరాటం చెందేవాడిని, నేను పుట్టి పెరిగిన ప్రాంతం కృష్ణమ్మ ఒడిలోనే ఉండేది కానీ మా గొంతులు తడిపేందుకు కానీ నెర్రలు చాచిన నేలకు నీళ్లు అందేవి కావు. భూమి శిస్తు చెల్లించలేక అనేకమంది రైతులు భూములను వదులుకున్నారు.
కేసీఆర్ దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర సాధనకు లక్ష్యం ఏర్పడింది. గతమంతా విషాదంగా ఉన్న ఉద్యమాన్ని అవహేళన చేసిన, తెలంగాణ రాదు, తెలంగాణ లేదు, అన్న వారి ముందు తెలంగాణ ఘెసను ప్రపంచము ముందు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరం ఉందో యావత్ దేశాన్ని మాత్రమే కాదు, సమైక్య ఆంధ్ర అని నినదించిన వారి చేతనే తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రం తప్ప మరో మార్గం లేదని చెప్పించిన కార్యసాధకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావించేదే కాదు అని గంట పదంగా చెబుతున్నాను. తెలంగాణకు కేసీఆర్ టార్చి బేరర్‌గా ఉన్నాడు. సంవత్సరన్నర కాలంలోనే మార్పు కోరుకున్న తెలంగాణ ప్రజల బాధలను చూసి చలించి నా తెలంగాణ ప్రజలు ఆగమైపోతున్నారని బాధతో తెలంగాణ విచ్ఛిన్నకర శక్తుల నుంచి ఎలా కాపాడుకోవాలో పార్టీ శ్రేణులకు సంసిద్ధం చేశారు.
తెలంగాణ ఊపిరి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర లక్ష్యసాధనలో రాజకీయ పార్టీ ఏర్పాటులో ఎన్నో సమస్యలను ఎన్నో బెదిరింపులు వచ్చిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పార్టీ నీ తెలంగాణ ప్రజలు కాపాడుకున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రక్తంలో నుంచి బీఆర్ఎస్ పార్టీని వేరు చేయలేరు. ఏప్రిల్ 27, 2001న పార్టీ ప్రారంభంతోనే తెలంగాణ తల్లి బానిస సంకెళ్ల నుంచి ఊపిరి పీల్చుకుంది. 14 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో పార్టీ అనేక సమస్యలపై సమరశీల పోరాటాలు చేసింది. తెలంగాణ ఉద్యమ చైతన్యమును పల్లె పల్లెకు తీసుకొని వెళ్ళింది. కూతవేటు దూరంలో నీళ్లు ఉన్నా మా గొంతులను మా భూములను ఎందుకు తడపడం లేదని గర్జించింది. మా రక్త మాంసాలతో పంచభక్ష పరమాన్నాలు తింటూ మాకు కొలువులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీసింది. ఆఖరికి కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టడంతో రాష్ట్ర ఒక్కసారిగా అట్టుడికి పోయింది. చేసేది ఏమీ లేక పోతూ పోతూ ముళ్ళకంచెలు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కేసీఆర్ నాయకత్వంలో అవంతరాలను, ఒడిదుడుకులను దాటి ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. సకల వర్గాల ప్రజలు సుభిక్షంగా కృష్ణమ్మ గోదావరి జల సవ్వడితో పాడిపంటలతో కొలువుల జాతరలతో విశ్వనగరం అక్కున చేర్చుకున్న వేళా మళ్లీ మొదటికి మోసం వచ్చింది.
శతాబ్దాల నుంచి తెలంగాణ అన్యాయం జరిగినది. దశాబ్దాల పాటు సమైక్య పాలకుల కుట్రలతో వెనకబడిన తెలంగాణ కెసిఆర్ గారి 10 వసంతాల పాలనలో చీకటి నుంచి వెలుగుల వైపు పరుగులు పెడితే మాయమాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ ప్రజానీకాన్ని మళ్లీ కొత్త రూపాలలో తెలంగాణను బానిస సంకెళ్లతో కట్టేసివేసేందుకు కుట్ర దారులు కొత్త దారులు వెతుకుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు కాంగ్రెసును నమ్మి మోసపోయామని గమనించి కేసీఆర్ గారు ఉన్నాడని ధైర్యంగా మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నారు.
తెలంగాణపై రాక్షస దండు రాజ్యమేలుతున్న తరుణంలో పార్టీ రజతోత్సవాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరగనున్నాయి. కేసీఆర్ గారి మార్గదర్శకంలో కేసీఆర్ గారి స్ఫూర్తితో దొంగల బారిన పడిన తెలంగాణను రక్షించేందుకు ప్రతి యువకుడు సైనికుడై కదన రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్ గారి కంఠంలో ప్రాణం ఉండంగా తెలంగాణకు అన్యాయం జరగనివ్వడు.. కేసీఆర్ గారి సముద్రంలో ఇసుక రేణువై తెలంగాణ పూర్వ వైభవానికి కారణభూతుడు నైతాను.. జై తెలంగాణ.. జై కేసీఆర్..
రంగినేని అభిలాష్ రావు,
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు,
సెల్ నెంబర్: 9121461111