మరీ గింతన్యాలమా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల బీజేపీ రాష్ట్ర నాయకులు నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఇంతకాలం టార్గెట్ చేసి బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నట్టు మునగ చెట్టు ఎక్కించారు. ఎన్నికలు దగ్గరపడేసరికి పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం ఏమైనా న్యాయంగా ఉందా?. అసలే పార్టీలో గ్రూపుల తగాదాలు, అధ్యక్షుడి మార్పు తదితర కారణాలతో పార్టీ గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. ప్రధాని మోదీ వచ్చివెళ్లినా, జాకీలు పెట్టిలేపినా పార్టీ లేచేటట్టు కనిపించడం లేదు. పార్టీ మళ్లీ మెయిన్ స్ట్రీమ్లోకి రావాలంటే… అది ఒక్క సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుందని ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. కనీసం నెలకోసారైనా తిడితే బాగుండేదంటున్నారు. పాపం.. కాస్తా వీలు చూసుకోండి సార్, వాళ్లు బాధపడుతున్నారు.
– వెల్జాల