అబ్ కీ బార్ సంకీర్ణ సర్కార్
ఉత్తరాదిలో ఇకముందు ‘అబ్ కీ బార్' అనే మాటలను ఏ రాజకీయ పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని అనుకోకపోవచ్చు. దీన్ని అంతగా అరగదీసి మూలకు పడేసింది బీజేపీ. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్' అనే నినాదం వశీకరణ కోసం పఠించిన మంత్రం మాత్రమేనని ఫలితాలు చూసిన తర్వాత తేలిపోయింది.
ఉత్తరాదిలో ఇకముందు ‘అబ్ కీ బార్’ అనే మాటలను ఏ రాజకీయ పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని అనుకోకపోవచ్చు. దీన్ని అంతగా అరగదీసి మూలకు పడేసింది బీజేపీ. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అనే నినాదం వశీకరణ కోసం పఠించిన మంత్రం మాత్రమేనని ఫలితాలు చూసిన తర్వాత తేలిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని వీలైనన్ని సభల్లో ఉల్లేఖించారు. కానీ చివరికి తమ పార్టీకి ఉన్న మెజారిటీ కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఎన్డీయే మిత్రపక్షాల మద్దతు లేకుండా బండి నడవని పరిస్థితి వచ్చిపడింది మోదీకి. ‘అబ్ కీ బార్ సంకీర్ణ సర్కార్’ అనుకోక తప్పదు. మరోసారి దేశంలో సంకీర్ణాల యుగం వచ్చేసింది. తెదేపా, జేడీయూ అనే రెండు చంకకర్రల వత్తాసుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మోదీ సిద్ధమవుతున్నారు. మొదటి విడతలో ఉన్న బీజేపీ మెజారిటీ రెండో విడతలో అపారంగా పెరిగింది. మూడో విడత వచ్చేసరికి ఆ పార్టీ బలం 240 వద్ద చతికిలబడింది. ఇది మోదీ ప్రతిష్ఠను చాలావరకు తగ్గించింది. ఇప్పుడు సంకీర్ణం నడపడం విషయం లో ఆయనకున్న ప్రతిభా పాటవాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ ఎంతవరకు సర్దుబాటుకు సిద్ధమవుతారన్నదే అసలు ప్రశ్న.
2014లో గుజరాత్ నుంచి నేరుగా ఢిల్లీ పీఠంపైకి వచ్చిపడిన మోదీకి అఖండమైన అధికారం దఖలుపడింది. దేశంలో గత పదేండ్లుగా మోదీ ఏకచ్ఛత్రాధిపత్య పాలన కొనసాగింది. భారతదేశ పరిపాలన కేవలం ఒక వ్యక్తి చుట్టూ తిరిగింది. మోదీ వ్యక్తి పూజ ఆకాశపుటంచులు తాకింది. పేరుకు ఎన్డీయే కూటమి అయినా బీజేపీకి సొంత మెజారిటీ ఉండటం కలిసివచ్చింది. కానీ ఇప్పుడదంతా కుదరదు. మిత్రపక్షాల కనుసన్నల్లో, వారు ముందుకుతెచ్చే డిమాండ్ల చెప్పుచేతల్లో పాలన నడవాలి. ఎప్పుడు ఎవరికి కోపం వస్తుందో, మద్దతు లాగేసుకొని మరో సంకీర్ణం వైపు పరుగులు తీస్తారో అని బెదురుబెదురుగా గడపాల్సి ఉంటుంది. సొంత ఎజెండా లేదా రహస్య ఎజెండా అనేది ఎంతమాత్రమూ కుదరదు. అన్ని పక్షాలు ఆమోదించిన కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రకారమే పాలన సాగించాల్సి ఉంటుంది. మద్దతు తెలిపిన నేతల గొంతెమ్మ కోరికలు తీర్చడమనేది కత్తి మీద సాము లాంటిది. అందరికీ తలలో నాలుకలా వ్యవహరించక తప్పదు. ఇది మోదీకి ఏ మాత్రం అలవాటు లేని విషయం. మూడో విడత మూన్నాళ్ల ముచ్చట అవుతుందా లేక కొసకంటా కొనసాగుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.
సంకీర్ణాలు మన దేశానికి కొత్త కాదు. రాజీవ్ గాంధీ హయాం తర్వాత చాలా సంకీర్ణాలే వచ్చాయి. చిన్నాచితకా పార్టీల నేతలు కూడా పెత్తనం చెలాయించడం సంకీర్ణాల ప్రత్యేకత. పిడికెడు మంది ఎంపీలున్నవారు కూడా మంత్రి పదవులు పొందడానికి వీలవుతుంది. ఐకే గుజ్రాల్, దేవేగౌడ వంటి నేతలు అనూహ్యమైన రీతిలో ప్రధాని పదవికి ఎగబాకడం సంకీర్ణాల మహత్యమే. సమష్టి తత్వం అనేది సంకీర్ణాల్లో తప్పనిసరి. ఢిల్లీలో గద్దెనెక్కేవారు ఇష్టారాజ్యంగా పోకుండా అదుపాజ్ఞలలో ఉండటం, ప్రాంతీయ ఆకాంక్షలకు ప్రాధాన్యం పెరగడం వంటి ప్రత్యేకతలు కొన్ని దీనికి ఉంటాయి. కేంద్రీకృత పాలన కన్నా సంకీర్ణ పాలనలో సమాఖ్యవాదం మెరుగ్గా ఉంటుంది అనేది అనుభవమే. ఢిల్లీ పాదుషా ఇప్పుడు సామంత రాజుల ఆధిపత్యంలోకి వచ్చారు. చంద్రబాబునాయుడు, నితీశ్‌కుమార్ యాదవ్ వంటి ప్రాంతీయ నేతలే చక్రం తిప్పుతున్నారు. బేరాలు కుదుర్చుకొని లిఖితపూర్వకంగా మద్దతు తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ ఇద్దరు నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించినట్టు వార్తలు వెలువడ్డప్పటికీ ప్రస్తుతం అలాంటిది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇద్దరు నేతలూ బేరసారాల్లో దిట్టలు. పైగా సమయానుకూలంగా విధేయతలు మార్చడంలో సిద్ధహస్తులు. ఈ కారణంగా కొన్ని అపనమ్మకాలు ఉన్నప్పటికీ మొత్తం మీద ప్రస్తుతానికి ఒడంబడికైతే కుదిరింది. మున్ముందు ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

