అతను నిత్యం మాట్లాడుతున్నాడు
ప్రజలెవరూ పెద్దగా
వింటున్నట్లు లేరు!
ఇతను మౌనంగా ఉంటున్నాడు
జనం ఎదురుచూస్తున్నారు
నోరెప్పుడిప్పుతాడోనని!
అతను గెలిచానని భ్రమపడుతున్నాడు
రోజూ ఓడిపోతున్న సంగతి అందరూ గమనిస్తున్నారు!
ఇతన్ని జన తిరస్కృతుడని
ప్రచారం ఎవరి నోట విన్నా
ఇతని గెలుపు గీతాలే!
అతను చరిత్రను చెరిపేస్తానన్నాడు
చేతిలో బతుకమ్మ మాయమై
పంట పొలాల్లో ప్రత్యక్షమైంది!
ఇతను రాసింది
చరిత్ర మాత్రమే కాదు
దేశం నివ్వెరపోయే ఉద్యమ ప్రస్థానం!
అతనిది ఎప్పుడు పదేండ్ల పలువరింతనే
పరాభవమొకటి ప్రతీకారం కోసం ఎదురుచూపు!
అతను నిస్సిగ్గుగా త్యాగాలకు వెలకట్టాడు
‘కోటి’ని కొనగోటితో తిరస్కరించే
‘సిద్ధన్న’లిటున్నారు!
ఇతనిప్పుడు కాలాతీతుడు
నిర్ణయం మనకొదిలేసి
నిశ్చింతగా ఉంటున్నాడు!
– కోట్ల వెంకటేశ్వరరెడ్డి
94402 33261