సత్తా ఉన్న చరిత్ర సావులేని చరిత్ర
తాలు చరిత్ర కాదు తగలడానికి
గాలి తన్నుకొని పోవడానికి
సుడిగాలి అయినా చూసి పోవాలి
రక్తం మరకల చరిత్ర
నరనరాన నెత్తుటి లిఖిత చరిత్ర
పోరాడిన వీరుని చరిత్ర
అంబేద్కర్ రాసిన
రాజ్యాంగ చరిత్ర సెడుపగలరా
అల్లూరి సీతారామరాజు పోరు వీరుని
అమరత్వం చరిత్ర సెడుపగలరా
సుభాష్ చంద్రబోస్
జీవ మరణ వార్త చెప్పగలరా సెడపగలరా
భగత్‌సింగ్ ప్రాణ త్యాగార్పణ
చరిత్ర తుడుపగలరా
చరిత్రను చెరిపే శక్తి
చరిత్ర సృష్టించిన వ్యక్తికే
చరిత్ర చెరపడం చేతకాదు
మరో మనిషి మరో వ్యక్తి చరిత్రకు
మసక రుయ్యగలడా
మరణం లేని చరిత్రలు
మనసులో పుడతాయి
మట్టిలో మొలకెత్తుతాయి
– దేవరపాగ కృష్ణయ్య 99634 49579