ఒరేయ్ నర్శిగా ఎందిర ఈ లొల్లి.. రోజు ఒక్కటే పరికంప లొల్లి. ఏమైందే రాజన్న. అరే మన పొరగాండ్లను చదువుకోనియ్యరు, ఇంత తిండి తిననియ్యరు. మొన్న కొందరు బద్మాష్గాల్లు గదేదో పేపర్ లీక్‌లు చేశారట కదా. అవునే రాజన్న. మా బిడ్డ కూడా చెప్పిందే. అది కాదురా నర్శి.. వాడెవ్వడో ఏదో చేసిండని నడుమ గీ లత్కోరు రాజకీయాలు ఏందిరా. పొద్దస్తమానం టీవీలు, పేపర్లలో.. ఒక్కటే లొల్లి.
మన పోరగాండ్ల జీవితాలతోనే చెలగాటం ఆడవట్టిరి. దినాం ఇదే నా. 30 లచ్చల పోరగాండ్లను ఆగం జెత్త రా? కాదు నర్శి వీళ్ల పంచాయతీ ఏందిరా జర జెప్పుర. రాజన్న.. బీజేపీ, కాంగ్రెస్ ఇం కో తుట్కుం మట్కుం పార్టీలోల్లు ఒకడి మీద ఒకడు పడి పొర్లినట్టు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కొట్లాట షురువు చేసిర్రే. ఆగో గదెందిరా. మన పోరగాండ్ల కోసమే కదరా తెలంగాణ తెచ్చింది సార్. మొన్ననే లక్ష సర్కార్ కొలువులు ప్రకటించే. మన బిడ్డలు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని పరీక్షల కోసం చదవుతున్నరు. మజ్జలో దొంగ బద్మాసులు తప్పు చేసిరి.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పి చేత్తరారా. మళ్ళీ పరీక్షలు పెడతామని కేటీఆర్ జెప్పిండు. అదేదో కోచింగ్‌లు, పుస్తకాలు ఫ్రీగనే ఇస్తం. మీ కోసం ప్రభుత్వం పని చేస్తుందనీ గంత మంచిగా చెప్పవట్టే. పేపర్ దొంగలను పట్టుకున్నరు. ఎంక్వరీ కూడా చేత్తుర్రట. ఎవడో చేసిన దానికి సర్కార్‌ను బద్నాం చెయ్యవట్టే. ఏండ్లకు ఏండ్లు ఏలినో డు ఏమన్న చేసిర్రా చెప్పురా నర్శి. ఏం లేదు. తిన్న పానం ఊకుంటదా రాజన్న అధికారం ఉన్నన్ని రోజులు మంచిగా తిని తిని బలిసి పోయిర్రి. ఇప్పుడు గదే పంచాయతీనే. కేంద్రం తెలంగాణకు రూపాయి ఇయ్యదు. మన పైసలే అక్కడికి పోవట్టే. నాకు ఇదే అనుమానం నర్షి రోజు ఈ కాంగ్రెస్, బీజేపీ నాయకులు పొద్దున లేస్తే కేసీఆర్ సార్‌ను కలవరిస్తరు. పని చేసే సార్ కాళ్లల్ల కట్టే వెట్టుడు అంటే గిదే. బీజేపీకి ఓటేస్తే ఏం చేసిందో తెల్వదా. రైతులకు పెట్టువడికి సాయం చేయరు. ఇన్ని మందు బస్తాలు ఇయ్యరు.
ఏం చెయ్యనోడు మనకే మీటర్లు పెడుతమంటే మన కేసీఆర్ సార్ ఊకున్నడా బాగా గరం అయిండు. సార్ ఉన్నన్ని రోజులు మనకు రంది లేదురా. దేశంల ఎవరన్న ఇట్ల అలోచన చేసిన్రా. మన కేసీఆర్ సార్ ప్రేమగల్ల సార్. రైతు బంధు పెట్టి10 వేల పెట్టువడి ఇస్తుండు. మనకు ఏమైన్నయితే పెండ్లం పిల్లలు ధైర్యంగా ఉండేందుకు 5 లక్షల రైతు బీమా
ధీమగా ఉంది.
నీళ్ళు లేక ఎన్నో గోసలు వడ్డం. పది ఇరవై బోర్లు ఏసి బొక్క బోర్లా పడితిమి. అప్పులు కుప్పలై అగమైతిమి. ఇప్పుడు చూడు కాళేశ్వరం పుణ్యమని మేడిగడ్డ నుంచి సిద్దిపేట, అవతల జనగాం, వరంగల్, నిజాంబాద్ తెలంగాణ అంతటా ఎవుసానికి నీళ్ళు రావట్టే. పంటలు దిగుబడి వస్తుంది.
నువ్వే దగ్గర ఉండి కాంట పెడితివి కదురా నర్శి. 100 కింటల్ల బస్తాలు వరి పండిస్తిమి. ఎన్నడైనా 30 బస్తాలు వరి గింజలకన్న ఎక్కువ పంట తియ్యలేదు. అందరూ అనవట్టే. తెలంగాణనే దేశానికి అన్నం పెడుతుందని. గింత కన్న సంతోషం ఏముంటదిరా. ఇదంత మన కేసీఆర్ చలువనే కదా . అవును రాజన్న ఇయ్యాల్ల బిడ్డల పెండ్లికి కూడా దిగులు లేదే. ఒకనాడు బిడ్డ పెండ్లి చెయ్యాలంటే అరిగొస ఏళ్లదీత్తిమి. ఆ సావుకారి దగ్గర, అక్కడ ఇక్కడ అప్పు చేసి పెండ్లి చేస్తిమి. ఇప్పుడు ఆ బాధ లేదు రాజన్న. కళ్యాణలక్ష్మి పేరుతోని మన బిడ్డకు వరం ఇచ్చిన దేవుడు కేసీఆర్ సార్. ఏ లోకం నుంచో మన కోసం వచ్చినట్టున్నడే రాజన్న. మన పోరగాల్ల కంట్ల కన్నీళ్లు తుడిచే మన పెద్దన్న కేసీఆర్. అందరిముందు తలెత్తుకునేలా ఇయ్యాల నిలబడ్డమంటే కేసీఆర్ తెచ్చిన దళిత బంధు వల్లనే కదా. మనకు రూపాయి ఖర్చు లేకుండా 10 లక్షల రూపాయలు ఇచ్చి మంచి వ్యాపారం చేసుకుని మంచిగా బతుకాలని ఇంత నియ్యత్ గల్లా హృదయం ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ తర్వాత మన కేసీఆర్‌నే అని చెప్పటానికి మన అందరి అదృష్టం అనుకోవాలి.
కేసీఆర్ సర్కార్‌ను ఇబ్బందులు పెడుతున్నరు. ఐదు నెల్ల కింద గిట్లనే కుట్రలు చేసి ఎమ్మెల్యేలను గద్దల లెక్క తన్నుక పోదామనుకున్నరు. ఏమైంది వాళ్ళే ఈడ లోపల పడ్డరు. ఇదంతా కాదురా నర్శి. పెద్ద సార్ దేశాన్ని తెలంగాణ తరిఖా చేద్దామని చెబితే గా బీజేపోల్లకు మింగుడు వడుతలేదట. ఎైట్లెన కేసీఆర్ సార్‌ను ఇరుకున వెట్టాలని రోజు ఏదో ఒక కుతంత్రం అల్లుతున్నరు. తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు వీళ్ల బెదిరింపులకు భయపడటోడు కాదు రాజన్న.
బీజేపీ వాళ్ళే కుట్రలు చేస్తున్నారాయే రాజన్న.. దినాం పరీక్ష పేపర్లు లీక్ చేసి వాట్సాప్‌లో వస్తున్నాయని ఫుకార్లు చెయ్యవట్టే.. పిల్లలను భయం పెట్టవట్రి. మా చిన్నోడు పది పరీక్ష రాస్తుండు. నిన్న రాత్రి ఎవడో చెప్పిండట పేపర్లు లీక్ అయ్యాయని. మావోడు ఒక్కటే దిగులు వడుతుండు రాజన్న. చిన్నోనికి ధైర్యం చెప్పద్దా నర్శి. చెప్పిన రాజన్న. పరీక్షలు జరుగుతాయని మంత్రి సబితమ్మ చెప్పింది. అరేయ్ నర్సి బీజేపీ వాళ్లు పెద్ద కుట్రలు చేస్తుర్రు. కేసీఆర్ సర్కార్ ను ఇబ్బందులు పెడుతున్నారు. ఐదు నెల్ల కింద గిట్లనే కుట్రలు చేసి ఎమ్మెల్యేలను గద్దల లెక్క తన్నుక పోదామనుకున్నరు. ఏమైంది వాళ్ళే ఈడ లోపల పడ్డరు. ఇదంతా కాదురా నర్శి. పెద్ద సార్ దేశాన్ని తెలంగాణ తరిఖా చేద్దామని చెబితే గా బీజేపోల్లకు మింగుడు వడుతలేదట. ఎైట్లెన కేసీఆర్ సార్‌ను ఇరుకున వెట్టాలని రోజు ఏదో ఒక కుతంత్రం అల్లుతున్నరు. తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు వీళ్ల బెదిరింపులకు భయపడటోడు కాదు రాజన్న. ఆయన 50 ఏండ్ల రాజకీయ జీవితమే పోరాటం. అలజడి, ఆందోళనలను తట్టుకున్న పానం. దేశం కోసం పానం బెట్టి పని చేస్తరు. ఏదైన సరే నర్శి కేసీఆర్ సార్ ఎంబడి ఉండాలే. బీజేపీ వాళ్ల నాటకాలేందో ఊర్లల్ల్ల చర్చ పెట్టాలే.
బిడ్డలారా! కేసీఆర్ సార్ ఉన్నంత వరకు తెలంగాణ , దేశం ఆగం కాదు. మంచిగా చదివి, పరీక్షలు బాగా రాయాలి. బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మితే ఆగమైతం. ఇప్పటికే దేశంలో 75 ఏండ్ల బాధ, ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్ల గోస పడ్డం. కేసీఆర్ సార్ పోరాటంతో తెలంగాణ వచ్చింది. మన తెలంగాణ మంచి తొవ్వలో పోతంది. తెలంగాణ లెక్క దేశం కూడా బాగుండాలని మన కేసీఆర్ సార్ తపన.
చిటుకుల మైసారెడ్డి: 94905 24724
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)