బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Apr 01, 2020 , 21:49:38

బొందవెట్టు

బొందవెట్టు

కరోనాను బొందవెట్ట

కంకణబద్ధులు గాండ్రి

మహమ్మారిని మట్టుపెట్ట

కార్యసిద్ధులై రాండ్రి!

భుజం భుజం తాకకుండా

గజం గజం ఎడంగానే


బుద్ధిగా మసులుకోండ్రి!

శుభ్రత పాటించుండ్రి

తేపతేపకూ చేతులు కడుగుండ్రి!

అత్యవసరమైతేనే

అడుగుబయట పెట్టుండ్రి!

గడపదాటి పోకుండా

గదుల్లోనే మెదులుండ్రి!

‘ఫారిన్‌' నుంచి వస్తే, తప్పక

‘క్వారంటైన్‌' కాండ్రి!

ప్రభుత్వాల సూచనలకు

ప్రజలంతా అండదండ గాండ్రి

పొద్దుమాపు సేవ చేయు

పోలీసులందరికీ..

ప్రాణాలను కాపాడే

వైద్యబృందమంతటికీ..

గండం తప్పించగా దండాలే పెట్టుండ్రి!! 


logo