శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Feb 27, 2020 , 23:59:07

బాధితులకు అండగా ఉండాలి

బాధితులకు అండగా ఉండాలి

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తండ్రిని కానిస్టేబుల్‌ కాలితో తన్నిన ఘటన అందరినీ కలిచివేసింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లోనూ వ్యతిరేకత వచ్చింది. ఈ ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించడం అభినందనీయం. తెలంగాణ ప్రభుత్వం మొదటినుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమలుచేస్తున్నది. బాధితులు నిస్సహా యస్థితిలో ఉన్నప్పుడు మానవీయంగా వ్యవహరించాలని ముఖ్యమం త్రి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. దానికి అనుగుణంగా పోలీసు లు వ్యవహరించాలి. బాధితులకు అండగా ఉండాలి.

- ఎం.మధు, జనగామ


అనాథలకు ఉపాధి కల్పించాలె

రాష్ట్ర ప్రభుత్వం పాలనలో అద్భుతమైన సంస్కరణలు తీసుకువచ్చిం ది. అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. హరితహారంతో పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనం పెంచడానికి కృషిచేస్తున్నది. 

చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా సాగునీటి సమస్య ను తీరుస్తున్నది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనాథల పట్ల సీఎం కేసీఆర్‌ తన ఔదార్యాన్ని చాటుకోవాలి. ఉపాధి కల్పించి తమ జీవితా ల్లో వెలుగునింపాలని అనాథలు కోరుకుంటున్నారు.   

- యెలిశెట్టి శంకరరావు, మియాపూర్‌, హైదరాబాద్‌


సంయమనం పాటించాలి

ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసకు దారితీయడం దీంట్లో కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దేశ రాజధానిలో జరుగుతున్న ఈ ఘటనల పట్ల అంతటా ఆం దోళన వ్యక్తమవుతున్నది. రోజురోజుకు పెరుగు తున్న మృతుల సంఖ్య చూస్తే యావత్‌ దేశం గుండె తరుక్కుపోతున్నది. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అట్లనే రాజకీయ పార్టీలు, రాజకీ య నాయకులు ఇలాంటి సమయాల్లో సంయ మనం పాటించాలి. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టకూడదు. అలానే దీనిపై రాజకీయం చేయకుండా ఉద్రిక్తతలు తగ్గించడానికి కృషిచేయాలి. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా సమస్య పరిష్కారం కోసం పనిచేయాలి. అప్పుడే శాంతియుత పరిస్థితులు నెలకొంటాయి.

- బి.రామాంజనేయులు, హైదరాబాద్‌


logo