శనివారం 29 ఫిబ్రవరి 2020
ఫలించిన భగీరథ ప్రయత్నం

ఫలించిన భగీరథ ప్రయత్నం

Feb 13, 2020 , 23:12:24
PRINT
ఫలించిన భగీరథ ప్రయత్నం

వరి ధాన్యాన్ని రాష్ట్ర అవసరాల మేరకు పండిస్తున్నాం. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి బడ్జెట్‌లో సరాసరిన రూ.25 వేల కోట్లు కేటాయిస్తూ రావటం ముదావహం. కేసీఆర్‌ స్వయంగా ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తుండటంతో అనతికాలంలోనే బీడు భూములకు సైతం సాగునీరు అందింది. ఫలితంగా నీరు ఎక్కువగా అవసరయ్యే వరిసాగు విస్తీర్ణం పెరిగింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ భగీరథ ప్రయత్నం ఫలించింది. కరువుబారిన పడిన తెలంగాణ ప్రాంతాన్ని అనతికాలంలోనే అన్నపూర్ణగా తీర్చిదిద్దటంలో సఫలీకృతులయ్యా రు. తెలంగాణ అంటే మెట్ట పంటలే తప్ప వరి పండించటానికి పనికిరాదన్న పసలేని వాదనను కేసీఆర్‌ తన కార్యచరణ ద్వారా తిప్పికొట్టారు. ఇటీవల ఆర్థికగణాంక శాఖ విడుదల చేసిన రెండో ముంద స్తు అంచనా నివేదిక ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది.


రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి నీళ్లందేలా, మొత్తంగా కోటి ఎకరాల మాగాణిని రైతులకు బహుమతిగా కేసీఆర్‌ అందజేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంతో పాటు పలు ఇతర సాగునీటి ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవటంతో పంటల సాగు విస్తీర్ణం సాధారణ అంచనాలను దాటింది. కరువు జిల్లాగా పేరుబోయిన పాత ఉమ్మడి పాలమూరు జిల్లా లో రైతులు యాసంగిలో సైతం వరి పంటను పండించటం ఆనందదాయకం. అయితే, చివరికి ఎండకాలంలో సైతం వరి పంటను పండించేందుకు ఇప్పటికే నారు పెంచుతుండటం చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి సౌలత్‌ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. 


అదే జిల్లాలో యాసంగి వేరుశనగ సాగు రెండింతలయ్యింది. నీళ్లు లేక సాగు చేయలేకపోతున్నాం అనే మాట జిల్లాలో ఎక్కడా వినిపించడం లేదు. ఒకప్పుడు కుటుంబం బతుకటానికి బీడువారిన భూములను అమ్ముకునే వారు. నేడు ఒక రైతు గానీ, కుటుంబం కానీ భూములు అమ్మాలన్న ఆలోచనకు రాకపోవటం ప్రభు త్వం రైతులకు రైతుబంధుతో పాటు సాగునీటి లభ్యత ఇస్తున్న భరోసాయే కారణమని చెప్పొచ్చు.


వరి ధాన్యాన్ని రాష్ట్ర అవసరాల మేరకు పండిస్తున్నాం. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి బడ్జెట్‌లో సరాసరిన రూ.25 వేల కోట్లు కేటాయిస్తూ రావటం ముదావహం. కేసీఆర్‌ స్వయంగా ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తుండటంతో అనతికాలంలోనే బీడు భూములకు సైతం సాగునీరు అందింది. ఫలితంగా నీరు ఎక్కువగా అవసరయ్యే వరిసాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాదితో పోలిస్తే 40.17 శాతం అధిక దిగుబడులు నమోదయ్యా యంటే ఉత్పత్తి ఎంత పెరిగిందో ఊహించాల్సిందే. దీనికి తోడు 2019-20లో వానకాలం, యాసంగి కలిపి ఒక కోటి 30 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులు నమోదు కానున్నాయని అంచనా. వరిసాగు విస్తీర్ణం 48.68 శాతం, మక్కజొన్న 22.91 శాతం పెరుగటంతో రాష్ట్రంలో ఆహారధాన్యాల దిగుబడుల రికార్డులన్నీ పెరిగాయి. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో అంటే 2014-15 సంవత్సరంలో వరి కేవలం 34.96 లక్షల ఎకరాల్లో సాగవ్వగా, ఈ ఏడా ది అది 68.50 లక్షల ఎకరాలకు చేరింది. అంటే విస్తీర్ణం రెండింతల య్యింది. 100 శాతం విస్తీర్ణం పెరిగిందని అర్థం. వరి సాగు విస్తీర్ణం పెరుగటం, పెరిగిన సాగునీటి లభ్యతకు సూచిక లాంటిది. వర్షాధారంగా పండని పంట ఇది. వరిధాన్యం దిగుబడి 2016-17లో తొలిసారిగా కోటి టన్నుల మైలురాయికి చేరుకోగా, ఈ ఏడాది 48.08 శాతం అదనంగా పెరిగి 1.48 కోట్ల టన్నులకు చేరిం ది. బియ్యం 2014-15 సంవత్సరంతో పోలిస్తే 2019-20 నాటికి 98.74 లక్షల టన్నులకు చేరి రెండింతలపైనే పెరిగింది.


పెరుగుతున్న సాగునీటి సౌకర్యంతో వచ్చే బడ్జెట్‌లో రెండు ప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరమున్నది. సాగునీటి అం దుబాటుతో వరి పంటను మాత్రమే పండించకుండా చూడాలి. వరిసాగుతో ఇప్పటికే రాష్ర్టానికి కావాల్సిన బియ్యం అవసరాలు తీరి మిగులు ఉన్నది. ఇతర దేశాలు, రాష్ర్టాలకు మన వరిపంటను ఎగుమతి చేయాలి. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి తెచ్చుకున్న ప్రాజెక్టు నీళ్ళను అనుత్పాదకతకు వాడుకోవద్దు. బదులుగా రైతులు మరింత ఆదాయాన్ని ఇచ్చే పంటల సాగు పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒకటైతే, రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు ఉన్న అపారమైన అవకాశాలను రైతులకు ఆదా య మార్గాలుగా మార్చాల్సి ఉన్నది. పెరిగిన గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతంలో వరికి బదులుగా మేలైన ప్రత్యామ్నాయ పం టగా ఆయిల్‌ ఫాంను ప్రోత్సహించవచ్చు.


పెరిగిన సాగునీటి లభ్యతతో తెలంగాణ రైతుల జీవన ప్రమాణాలు కచ్చితంగా పెరుగనున్నాయి. సాగునీరు పంటల దిగుబడికి ఎంతో ముఖ్యమైనది. మెట్ట ప్రాంతాలతో పోలిస్తే సాగునీటి సౌకర్యమున్న ప్రాంతాలలో పంటల దిగుబడులు 2 నుంచి 3 రెట్లు ఎక్కువ. అంటే ఉన్న విస్తీర్ణంలోనే అదే పంటతో రెండు రెట్లు రైతుల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ పనులు పెరిగి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా సాగులో పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో పంటల ఉత్పత్తి ఖర్చులు ఎక్కువయ్యేవి. అందుకు కారణం కాలువల ద్వారా ఉచితంగా రైతులకు సాగునీరు అందేది కాదు. రైతులు బోరుబావులపైనే ఆధారపడటం, తరచుగా అవి విఫలం కావటంతో పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండేవి. కానీ నేడు తెలంగాణ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాగునీటి లభ్యత పెరుగటంతో,మెట్ట భూములు జలకళ సంతరించుకొని పచ్చని మాగాణి భూములుగా మారి రైతుకు ధైర్యాన్నిస్తున్నాయి. 


 ఇక బిందు, తుంపర సేద్య పద్ధతులు రైతులు అవలంబిస్తే ఇంకా నీటి అవసరం తగ్గుతుంది. అంటే ఒక ఎకరాలో వరిసా గు చేయటానికి సరిపడే సాగునీటితో ఆరు ఎకరాలలో ఆయిల్‌ ఫాం సాగు చేయవచ్చు. ఏటా మనం వేల కోట్ల రూపాయల విలువ చేసే నూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బదులుగా ఆయి  ల్‌ ఫాం సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌, మిజోరం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే అధిక విస్తీర్ణంలో ఆయి  ల్‌ ఫాం సాగవుతున్నది. రాష్ట్రంలో 18 జిల్లాల్లోని 206 మండలాల్లో ఆయిల్‌ ఫాం సాగుకు అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయని కేంద్ర నిపుణుల కమిటీ తెలిపింది. 3 లక్షల  హెక్టార్లలో సాగు చేసుకునేందుకు వీలున్నది. ఇప్పుడున్న విస్తీర్ణం 18 వేల హెక్టార్లు  మాత్రమే. అయితే భవిష్యత్తులో ఆయిల్‌ ఫాం సాగుకు తెలంగాణ చిరునామాగా ఎదుగవచ్చు.


పెరిగిన సాగునీటి లభ్యతతో తెలంగాణ రైతుల జీవన ప్రమాణాలు కచ్చితంగా పెరుగనున్నాయి. సాగునీరు పంటల దిగుబడికి ఎంతో ముఖ్యమైనది. మెట్ట ప్రాంతాలతో పోలిస్తే సాగునీటి సౌకర్యమున్న ప్రాం తాలలో పంటల దిగుబడులు 2 నుంచి 3 రెట్లు ఎక్కువ. అంటే ఉన్న విస్తీర్ణంలోనే అదే పం టతో రెండు రెట్లు రైతుల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ పనులు పెరిగి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా సాగులో పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో పంటల ఉత్పత్తి ఖర్చు లు ఎక్కువయ్యేవి. 


అందుకు కారణం కాలువల ద్వారా ఉచితంగా రైతులకు సాగునీరు అందేది కాదు. రైతులు బోరుబావులపైనే ఆధారపడటం, తరచుగా అవి విఫలం కావటంతో పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండేవి. కానీ నేడు తెలంగాణ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాగునీటి లభ్యత పెరుగటంతో, మెట్ట భూములు జలకళ సంతరించుకొని పచ్చని మాగాణి భూములుగా మారి రైతుకు ధైర్యాన్నిస్తున్నాయి. ఇందుకు దశ-దిశ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే. ఇప్పటికీ వ్యవసాయంలో ఆదర్శ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అతిత్వరలో దేశ ఆహారధా న్యాలకు పెద్ద వనరుగా, అన్నపూర్ణగా మారనున్నది.

(వ్యాసకర్త: అసోసియేట్‌ ప్రొఫెసర్‌, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)


logo