శనివారం 28 మార్చి 2020
Editorial - Feb 12, 2020 , 23:47:40

సామాన్యుడేం చేయగలడు?

సామాన్యుడేం చేయగలడు?

చాపకింది నీరులా 

ప్రవహించగలడు

తూము కింద ప్రవాహమై 

ముంచెత్తగలడు

చాయ్‌వాలా చేత

నీళ్ళు తాగించగలడు

సామాన్యుడేం చేయగలడు?

అప్పుడప్పుడు 

వెలిగిపోగలడు

కొండొకచో 

వెలిగించగలడు

వెలుగుతున్నానని విర్రవీగితే

నీ తల తెంచగలడు

సామాన్యుడేం చేయగలడు?

కన్నీళ్లు తుడువగలడు

కంటి తడిని 

ఆపగలడు

లేని కన్నీళ్ళను నటిస్తే

కంట నీరు తెప్పించగలడు

సామాన్యుడేం చేయగలడు?

గల్లీని మార్చగలడు/ ఢిల్లీని ఏలగలడు

ఏమార్చే వారికి

మూర్చ తెప్పించగలడు

అతడు/ పేరుకే సామాన్యుడు

శివమెత్తితే అసమాన్యుడు

అతడు 

జూలు విదిలిస్తే 

కోట గోడలు కూలుడే

ఊడ్చుకుంటూ పోతే/ చక్రవర్తి అయినా

చెత్తలో చేరుడే/ చరిత్రలో నిలుచుడే.

- విలాసాగరం రవీందర్‌, 94409 32934


logo