
గద్వాల, డిసెంబర్ 22 : జిల్లా దవాఖానలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా.. వైద్య సేవలందించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులను మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రతిచిన్న దానికి రోగులను కర్నూల్, హైదరాబాద్‌కు ఎందుకు రెఫర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హిమాలయ బంకెట్ హాల్లో వైద్య, ఆరోగ్య శాఖ, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలో కాన్పుల సంఖ్య పెంచాలన్నారు. గర్భిణులు ప్రైవేట్ దవాఖానకు వెళ్లడం అధికారుల నిర్లక్ష్యమే అని అన్నారు. అత్యవసరమైతే తప్పా రోగులను ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయరాదన్నారు. ప్రజలకు ప్రభుత్వ దవాఖానలపై నమ్మ కం కలిగించాలన్నారు. మహబూబ్‌నగర్, వనపర్తిలో జరిగే సమావేశాలకు గద్వాల దవాఖాన నుంచి వైద్యాధికారులు రావాలని ఆదేశించారు. దవాఖానలో ల్యాబ్‌లు, ఆక్సిజన్ ప్లాంట్లు, గుం డె, క్యాన్సర్ తదితర రోగాలకు సంబంధించిన వసతులు ప్రభుత్వం కల్పించిందని.. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో చందూనాయక్కు సూచించారు. అధికారుల పనితీరులో మార్పు రావాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో సబ్‌సెంటర్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరగడం లేదని అధికారులను ప్రశ్నించగా.. వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో అసహనం చెందా రు. అయిజ దవాఖానను సీహెచ్‌సీగా మార్చేందుకు నిధులు ఉన్నప్పటికీ.. వసతులు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. 300 పడకల దవాఖాన, నర్సింగ్ కళాశాల అందుబాటులోకి వస్తే నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. 20కి పైగా స్పెషాలిటీ సేవలు జిల్లా దవాఖానలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయా శాఖలకు సంబంధించి అడిట్ చేసుకోవాలని సూచించారు. జిల్లా దవాఖానకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మంత్రిని కోరారు. సమావేశంలో డీఎంఈ రమేశ్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు అబ్రహం, ఆలవెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, కశిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ సరిత, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ శ్రీహర్ష, మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్, విజయ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
వైద్యాభివృద్ధికి విశేష కృషి
గద్వాలటౌన్, డిసెంబర్ 22 : రాష్ట్రంలో వై ద్యాభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం జి ల్లా కేంద్రంలో నర్సింగ్ కళాశాల, 300 పడకల దవాఖాన, జిల్లా దవాఖానలో రెడియాలజిస్టు నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆక్సిజన్ ప్లాంట్, నవజాత శిశు సంరక్ష ణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోగులకు ఎలాంటి ఇ బ్బందులు కలుగకుండా చూడాలన్నారు.