‘వనపర్తి జిల్లాకు నిధుల వరద పారుతున్నది. సీఎం కేసీఆర్ సహకారంతో వన్నెల వనపర్తిగా తీర్చిదిద్దుతాం. కర్నెతండా లిఫ్ట్ చరిత్రలో నిలిచిపోనున్నది. కేవలం 22 నెలల్లోనే నిర్మించిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుంది. ఎత్తిపోతల కోసం భూ సేకరణకు సహకరించిన రైతులకు దండం పెట్టినా తప్పు లేదు. 19న వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఉన్నది’.. అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రూ.44 కోట్లతో నిర్మించిన మార్కెట్ యార్డు, 440 డబుల్బెడ్రూం ఇండ్లను ముఖ్యమంత్రి ప్రారంభించనుండగా.. బుధవారం కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వ
రావుతో కలిసి ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అలాగే కర్నెతండాలో హెలిప్యాడ్ స్థలాన్ని కూడా
పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నూతన కలెక్టరేట్‌తోపాటు మెడికల్, నర్సింగ్
కళాశాలకు, వేరుశనగ పరిశోధన, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్‌రిజిస్ట్రార్, నీటి పారుదల
శాఖ సీఈ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
వనపర్తి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాకు నిధుల వరద పారిందని, పట్టణాన్ని వన్నెల వనపర్తిగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సీఎం ప్రారంభించను న్న రూ.44 కోట్లతో నిర్మించిన మార్కెట్ యార్డు, 440 డబుల్బెడ్రూం ఇండ్లతోపాటు కర్నెతండాలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని బుధవారం కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావుతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం వనపర్తి మంత్రి నివాసంలో పార్టీశ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 19న వనపర్తి జిల్లా పర్యటనకు రానున్నారని తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ఏదుల రిజర్వాయర్‌ను కేవలం 22 నెలల్లోనే నిర్మించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. భూసేకరణకు సహకరించిన రైతులకు దండం పెట్టినా తప్పులేదని మంత్రి అన్నారు. పార్టీలకతీతంగా ఏదుల రిజర్వాయర్ నిర్మాణానికి నాయకులు సహకరించారని చెప్పారు. ఇం కో వెయ్యేండ్లయినా ఏదుల ప్రాజెక్టు నిర్మించినందుకు సీఎం కేసీఆర్ పేరు, నియోజకవర్గ ప్రతినిధిగా తన పేరు నిలిచిపోతుందని అన్నారు. సీఎం సహకారంతో జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వనపర్తి జిల్లాగా ఏర్పడుతుందని తనకు ముందే తెలుసని, ఈ విషయం సీఎంతోపాటు తనకే తెలుసన్నారు. కర్నెతండా ఎత్తిపోతల పథకం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పారు. గిరిజనుల ఆవాస ప్రాంతాలు ఎత్తయిన ప్రాంతంలో ఉంటాయని, అలాంటి తండాలకు సాగునీరు అందించడానికి రూ.76.19 కోట్లతో చేపట్టిన లిఫ్టు పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే రూ.64 కోట్లతో నిర్మించిన కలెక్టర్ కార్యాలయం ప్రారంభంతోపాటు రూ. 700 కోట్లు.. 600 పడకలతో నిర్మించనున్న మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్ కళాశాలకు, వేరుశనగ పరిశోధన, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్‌రిజిస్ట్రార్, నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయానికి శంకుస్థాపన చే యనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, వేణుగోపాల్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు మాణిక్యం ఉన్నారు.
సీఎం పర్యటనను సక్సెస్ చేయాలి..
ఖిల్లాఘణపురం, డిసెంబర్ 15 : మండలంలోని క ర్నె తండాకు 19న ముఖ్యమంత్రి కేసీఆర్ రానుండడం తో పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం తండాలోని హెలిపాడ్, పార్కింగ్ స్థలం, పైలాన్, సభ ప్రాంగణం పనులను కలెక్టర్, ఎస్పీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షాపూర్, ఆముదంబండ తండా, కర్నెతండాకు వెళ్లే ప్రధాన రహదారి వెంట మొక్కలు నాటాలన్నారు. మొక్కలు లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌండ్ సిస్టమ్, టెంట్లు, సభా ప్రాంగణాన్ని ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. సభకు హాజరయ్యే ప్రజలు, నాయకులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వేరుశనగ పరిశోధన కేంద్రం పరిశీలన
పెద్దమందడి, డిసెంబర్ 15 : మండలంలోని వీరాయపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న వేరుశనగ పరిశోధన కేంద్రానికి 19న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. బుధవారం స్థలాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ సీఎం పర్యటన సందర్భంగా పకడ్బందీగా ఏర్పా ట్లు చేయాలని ఆదేశించారు. ఈ పరిశోధన కేంద్రం ఏ ర్పాటు చేయడం వల్ల జిల్లాలో కొత్త వేరుశనగ వంగడాలను ఉత్పత్తి చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆశిష్సంగ్వాన్, రైతుబంధు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజప్రకాష్‌రెడ్డి, తాసిల్దార్ సునీత, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.