
మహబూబ్‌నగర్, డిసెంబర్ 22 : నిరుపేదలను ఉ న్నతస్థాయికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎ క్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. అందుకనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి ఆవరణ లో సెమీ క్రిస్మస్ వేడుకలకు కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి హాజరయ్యారు. కేక్ కట్ చేసి కలెక్టర్, పాస్టర్ రె వరెండ్ వరప్రసాద్‌కు మంత్రి తినిపించారు. అనంతరం పేద క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు పడుగల వేళ దుస్తువులు పంపిణీ చేయడం, భోజనాన్ని ఏ ప్రభుత్వం పెట్టలేదని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రతి పండుగకు పేదలకు ఉచితంగా దుస్తువుల పంపిణీతపా టు భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. విభిన్న మతా లు, కులాలు, సంస్కృతులకు దేశం నిలయమని, ఎ లాంటి కలహాలు లేకుండా అన్ని మతాల వారు కలిసి మెలిసి జీవించాలన్నదే తమ అభిమతమన్నారు. ఇందుకోసం ఏసుక్రీస్తును ప్రార్థించాలని కోరారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్ గోవింద్, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, తాసిల్దార్ పార్థసారథి, కౌన్సిలర్లు రాంలక్ష్మణ్, రాణి, కోఆప్షన్ సభ్యులు వరలక్ష్మి, డేవిడ్‌పాల్, పరంజ్యోతి, యేసుపాదం, డాక్టర్ సామిల్, డీటీ క్రాంతికుమార్‌గౌడ్, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఎప్పుడూ లేనంత అభివృద్ధి..
గండీడ్/మహ్మదాబాద్, డిసెంబర్ 22 : గతంలో ఎ న్నడూ లేనంతగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం గండీడ్, మహ్మదాబాద్ మండలాల్లో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.50 లక్షలతో సంగాయిపల్లిలో, రూ.67 లక్షలతో బాపనికుంట తం డాలో, చీకర్లబండ తండా బీటీ రోడ్లకు, వెంకట్‌రెడ్డిపల్లి సబ్‌స్టేషన్‌కు, గాధిర్యాల్లో సరస్వతీ విగ్రహావిష్కరణకు శంకుస్థాపన చేశారు. అలాగే మహ్మదాబాద్‌లోని ఏటీఆర్ పాఠశాలలో జాతీయ గణితశాస్త్ర దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్, గణిత ఉపాధ్యాయు డు సూర్యనారాయణను పాఠశాల హెచ్ఎం అంజిరెడ్డితో కలిసి మంత్రి సన్మానించారు. తర్వాత మహ్మదాబాద్ నుంచి యువకులతో కలిసి బైక్ ర్యాలీతో పాటు మృతుడు జవాన్ పరశురాం స్వగ్రామం గువ్వనికుంట తండాకు మంత్రి చేరుకున్నారు. ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మృతి చెందిన సోల్జర్ కుటుంబానికి 2.20 గుంటల భూమితోపాటు పాలమూర్లో అతడి భార్యకు డబుల్ బెడ్రూం ఇల్లు, జవాన్ తల్లికి మహ్మదాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో బోరు వేయించి కరెంట్ మోటర్ బిగించి ఇ స్తామని భరోసానిచ్చారు. జవాన్ పిల్లలని గురుకుల పా ఠశాలల్లో చదివిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గా ధిర్యాల్ గ్రామంలో సరస్వతీ విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లడంతో మిగితా కార్యక్రమాలకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి హాజరయ్యారు. రెడ్డిపల్లి బీటీ రోడ్డుకు శంకుస్థాపన, సల్కర్‌పేట్ పాఠశాలలో సైన్స్‌ల్యాబ్ ప్రారంభం, వెన్నాచేడ్‌లో రైతువేదిక, మిషన్ భగీరథ ట్యాంకు, అదనపు తరగతి గదులు, లైబ్రరీ భవనాలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, రైతుబంధు సమి తి మండల అధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, కోఆప్షన్ సలీం, సర్పంచుల సంఘం మం డల అధ్యక్షుడు గోపాల్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు పెంట్యానాయక్, భిక్షపతి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.