కాచిగూడ : పార్కుల సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజకీయలకు ఆతీతంగా నియోజకవర్గం లోని పార్క్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బర్కత్‌పురలోని విక్రంనగర్ పార్క్ అభివృద్ధి పనులను రూ.80 లక్షల రూపాయలతో బుధవారం కాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేశ్యాదవ్తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించారు.
అనంతరం అధికారులతో పర్యటించి పార్క్‌లోని సమస్యలను స్వయంగా వాకర్స్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్క్ ద్వారం వద్ద ఆర్చ్ నిర్మాణం చేపట్టాలని,పార్క్‌లోకి వాకింగ్‌కు వచ్చేవారికి ఇబ్బందులు తలేత్తకుండా వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా సందర్శకుల కోసం పార్క్ గోడలపై వినూత్నమైన చిత్రాల వేయించి, పార్క్ చుట్టుపక్కల మొక్కలు, పుట్‌పాత్‌లపై బెంచీలను ఏర్పాటు చేయాలని సూచించారు.రాబోయే తరాలకు పచ్చదనాన్ని ఇవ్వడానికి తమవంతు బాధ్యతగా స్థానికులందరూ పార్కులను సంరక్షించుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్లోర్‌లీడర్, టీఆర్ఎస్ నాయకుడు దిడ్డి రాంబాబు, కన్నె రమేశ్‌యాదవ్,డివిజన్ అధ్యక్షుడు ఎర భీష్మాదేవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్,ఏఈ ప్రేరణ,సంపత్, తదితరులు పాల్గొన్నారు.