ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం నుంచి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సహాయంతో ఈ డ్రైవ్‌ను చేపట్టనున్నట్లు ప్రకటించారు. వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థుల ఉపయోగార్థం ఓయూ హెల్త్ సెంటర్లో ఈ క్యాంపును ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఈ నెల 23 నుంచి వచ్చే నెల 5 వరకు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12.00 గంటల వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ ఆధార్‌కార్డును తీసుకుని సంబంధిత కేంద్రం వద్ద సంప్రదించాలని సూచించారు.