కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 10: జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న గిర్దావర్లు, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ స్థానంలో చేరిన తరువాత వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అశ్వారావుపేటలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్ జి.నరసింహారావును కలెక్టరేట్‌కు అటాచ్ చేశారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న సీనియర్ అసిస్టెంట్ వీ లావణ్యను అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయంలో నియమించారు. మణుగూరు గిర్దావర్-1 సీహెచ్ మేఘమాల స్థానంలో బి.లీలావతిని నియమించారు. చండ్రుగొండ గిర్దావర్-2 కె.జనార్దన్‌ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో కలెక్టరేట్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న గిర్దావర్-1 టి.అరుణను నియమించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరేట్(పాల్వంచ)లో పనిచేస్తున్న ఎం.లక్ష్మీనారాయణ స్థానంలో చండ్రుగొండ గిర్దావర్-2 కె.జనార్దన్‌ను నియమించారు. టేకులపల్లి గిర్దావర్-2 బి.సుమంత్‌ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో పాల్వంచ గిర్దావర్-2 పి.రాజశేఖర్‌ను నియమించారు. లక్ష్మీదేవిపల్లి తహసీల్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న గిర్దావర్-2 స్థానంలో టేకులపల్లి గిర్దావర్-2 ఎం.సుమంత్‌ను నియమించారు. ఇల్లెందు గిర్దావర్-2 సూర్యనారాయణను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో భద్రాచలం సబ్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్ అఫ్రోజ్‌ను నియమించారు. పినపాక తహసీల్ కార్యాలయంలో పనిచేస్తున్న వీరరాజును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో కొత్తగూడెంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కె.బాలకృష్ణను నియమించారు. భద్రాచలం సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ అఫ్రోజ్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో పినపాక గిర్దావర్-1 వీరరాజును నియమించారు. మణుగూరు గిర్దావర్-2 రామయ్యను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఆళ్లపల్లి గిర్దావర్-1 వై.శ్రీనివాసరావును నియమించారు. మణుగూరు గిర్దావర్-2 రామయ్యను ఆళ్లపల్లి గిర్దావర్-1గా నియమించారు. కరకగూడెం తహసీల్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ నర్సింహారావును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో జూలూరుపాడు తహసీల్ కార్యాలయం గిర్దావర్-2 సీహెచ్ వీరభద్రాన్ని నియమించారు. దుమ్ముగూడెం తహసీల్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ రత్తయ్యను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో కరకగూడెం తహసీల్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కాకా నరసింహారావును నియమించారు. టేకులపల్లి గిర్దావర్-1 మంగ్యాను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో దుమ్ముగూడెం సీనియర్ అసిస్టెంట్ రత్తయ్యను నియమించారు. చుంచుపల్లి తహసీల్ కార్యాలయం గిర్దావర్-1 టి.కృష్ణను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో టేకులపల్లి గిర్దావర్-1 జి.మంగ్యాను నియమించారు. అశ్వారావుపేట గిర్దావర్-1 వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో చుంచుపల్లి గిర్దావర్-1 టి.కృష్ణను నియమించారు. చర్ల గిర్దావర్-1 చందర్రావును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో అశ్వారావుపేట గిర్దావర్-1 వి.వెంకటేశ్వరరావును నియమించారు. దమ్మపేట గిర్దావర్-1 బి.బిక్షమయ్యను పాల్వంచ తహసీల్ కార్యాలయానికి బదిలీ చేశారు. అశ్వాపురం గిర్దావర్-2 కె.మాధవి స్థానంలో సుజాతనగర్ గిర్దావర్-2 టి.నాగమణిని నియమించారు. అశ్వాపురం గిర్దావర్-2 కె.మాధవిని భద్రాచలం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మొబైల్ కోర్టులో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ జె.రఘు స్థానంలో జూలూరుపాడు గిర్దావర్-1 ఎం.రవిని నియమించారు. చండ్రుగొండ సీనియర్ అసిస్టెంట్ కళావతిని కొత్తగూడెం తహసీల్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమె స్థానంలో లక్ష్మీదేవిపల్లి సీనియర్ అసిస్టెంట్ జె.రఘును నియమించారు. సుజాతనగర్ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లును దమ్మపేట తహసీల్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో కరకగూడెం గిర్దావర్-1 తోలెం బాబును నియమించారు. దమ్మపేట గిర్దావర్-1 భిక్షమయ్య, కొత్తగూడెం తహసీల్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, జూలూరుపాడు గిర్దావర్-2 వీరభద్రం, మణుగూరు గిర్దావర్-1 మేఘమాల, అశ్వాపురం గిర్దావర్-1 తిరుపతిరావు, కొత్తగూడెం గిర్దావర్-2 లక్ష్మయ్య, దమ్మపేట గిర్దావర్-2 మల్లయ్య, ములకలపల్లి తహసీల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ హచ్యా, పాల్వంచ గిర్దావర్-2 రామయ్య, కొత్తగూడెం గిర్దావర్-2 పి.లక్ష్మయ్య, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయం ఫీల్డ్ అసిస్టెంట్ నూర్జహాన్ను భద్రాచలం ఐటీడీఏ కార్యాలయానికి బదిలీ చేశారు.