
రామచంద్రాపురం, డిసెంబర్ 24 : దేశం గర్వపడేలా విద్యార్థులు అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నదని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అరబిందో ఫార్మ సంస్థ సహకారంతో గీతాభూపాల్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రొటెం చైర్మన్, ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొటెం చైర్మన్ మాట్లాడుతూ 40మంది విద్యార్థులతో మొదలైన జూనియర్ కళాశాలలో ఇప్పుడు 800 మంది విద్యార్థులు చదువుకోవడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ చదువుకోసం ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో పటాన్చెరులో డిగ్రీ కళాశాలను నిర్మించినట్లు చెప్పారు. విద్యార్థులు బాగా చదివి దేశం గర్వపడే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్సీపురం కార్పొరేటర్ పుష్పానగేశ్, అరబిందో ఫార్మ డైరెక్టర్ సదానందరెడ్డి, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, మాజీ ఎంపీపీ యాదగిరి, నాయకులు ఆదర్శ్‌రెడ్డి, కుమార్‌గౌడ్, మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, బూన్, విజయ్, ప్రమోద్‌గౌడ్, దేవేంద్రాచారి, కృష్ణమూర్తిచారి, నర్సింహ, జగన్నాథ్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.