ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. బుధవారం కొత్తపేటలోని తన నివాసంలో ల్యాబ్స్ క్వార్టర్స్‌కు చెందిన లబ్దిదారులు లక్ష్మికి రూ. 53 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా మాట్లాడుతూ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా బరోసాను కల్పిస్తోందన్నారు. పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తూ ప్రభుత్వ వైద్యశాలలను ఆధునీకరించడంతో పాటుగా పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేయూతను అందిస్తోందన్నారు.