
నిజాంపేట, డిసెంబర్ 20 : రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం నిజాంపేటలో యా సంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యాసంగి వరి పంట సాగు విషయంలో ఢిల్లీలో వద్దు అంటూనే గల్లీలో యాసంగి వరి సాగు చేయాలని అనడం సరికాదన్నారు. అన్నదాతల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిత్య శ్రామికుడిలా పని చేస్తున్నాడని, రైతులపై ఏ మాత్రం కేంద్రప్రభుత్వానికి సోయి ఉన్నా ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, వైస్ ఎం పీపీ ఇందిర, సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం
-ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
హవేళీఘనపూర్, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభు త్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఆందోళకు గురి చేస్తున్నదని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నా రు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం మండలంలోని వాడి, రాజ్‌పేట గ్రామాల్లో రైతులతో కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ ధోరణితో రైతులు అయోమయానికి గురవుతున్నారన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణం, కల్యాణలక్ష్మి, రైతులుబంధు, రైతుబీమా లాంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ప్రవేశపెడుతున్నారా.? అని ప్రశ్నించారు. రాజకీయ పబ్బం కోసం పారా బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పడం ఎంత వరకు సమంజసమని, గతంలో లేని రూల్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు రాష్ట్రంలో ఎక్కడా కూడా గోదాంలు నిర్మించలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్‌లు సరిత, రాజేందర్‌రెడ్డి, కాట్రోత్ కిషన్, యామిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీను, సాయిలు, సిద్ధిరెడ్డి పాల్గొన్నారు.