నిజామాబాద్ క్రైం, జనవరి 2: నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యా యి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతం నగర్ బైపాస్ రోడ్డులో ఆదివారం తెల్లవారు జామున అతివేగంగా వెళ్తున్న ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని బయటికి తీశారు. ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా, కారు ముందుభాగం ధ్వంసమైంది. క్షతగాత్రులు చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు వెళ్లారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.