కాచిగూడ : బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో గత కొన్నేండ్లుగా కృషి చేస్తున్నలక్ష్మణాచారి అభినందనీయుడని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. లక్ష్మణాచారి బాల కార్మికుల్లో చైతన్యం నింపి, వారికి అవగాహన కల్పించి బడిలో చేర్పించడం గొప్ప విషయమని ముఠాగోపాల్ అన్నారు.
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సావిత్రీబాయి ఫూలే ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గ్లోబర్ టీచర్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయుడు, ప్రేరణ బాలల వేధిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణాచారిని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అభినందించి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల సంక్షేమం, బాల కార్మిక విముక్తి-బాలల హక్కుల పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో లక్ష్మణాచారి చురుకైన పాత్ర పోషించాడని ఆయన కొనియడారు. ప్రభుత్వ ఉప్యాధ్యాయుడిగా లక్ష్మణాచారి పనిచేస్తూనే ప్రేరణ బాలల వేదిక పేరుతో నగరంలోని మురికివాడల్లో నివసిస్తున్న బాల కార్మికులు, వీధి బాలలను పాఠశాలల్లో చేర్చేందుకు 27 యేండ్ల నుంచి కృషి చేయడం గొప్పవిషయమన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలేశ్, సత్యగౌడ్, పి.ఎల్ ఫౌండేషన్ ఛైర్మన్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.