
హత్నూర, జనవరి 7 : రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం హత్నూర నుంచి దౌల్తాబాద్ వరకు రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రైతుబంధు, రైతుబీమా పథకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెప్పారు. రైతుబంధు సాయంగా ఇప్పటివరకు ప్రభుత్వం రూ.50 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిందని, దీంతో రైతులు సంబురాలు చేసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వావిలాల నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రైతు బాంధవుడు.. సీఎం కేసీఆర్..
చిలిపిచెడ్, జనవరి 7 : అన్నదాతల కష్టాలు తీరుస్తున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ రైతు వేదిక నుంచి చిలిపిచెడ్ రైతు వేదిక వరకు రైతులు ఎండ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. రైతులతో కలిసి ఎమ్మెల్యే ఎండ్ల బండిపై సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని ఊరేగించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోదదుర్గారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు సుభాశ్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు షఫీ, రైతుబంధు జిల్లా సభ్యుడు సయ్యద్ హుస్సేన్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.