
గద్వాల న్యూటౌన్, డిసెంబర్ 31 : మానవత్వం మంటగలుస్తున్నది. ఆస్తి తగదాలు, కుటుంబ కలహాలు, పగలు, ప్రతీకారాలు, వివాహేతర సంబంధాలు, డబ్బు.. ఇలా కారణాలు ఏవైనా హత్యలు పెరుగుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది 18 హత్యలు జరిగాయి. నాలుగేండ్ల కాలంలో గద్వాల, అయిజ, ధరూర్, కేటీదొడ్డి, గట్టు, మల్దకల్, రాజోళి, శాంతినగర్, అలంపూర్ తదితర మండలాల పరిధిలో 62 హత్య కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఏటేటా హత్య కేసులు పెరుగుతున్నాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై అన్యోన్యంగా జీవిస్తున్న కుటుంబాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చురేపుతున్నాయి. క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవించడమే కాకుండా.. ఆయా కుటుంబాలపై జీవతాంతం తీవ్ర ప్రభావం చూపుతున్నది. ప్రధానంగా తల్లి లేదా త్రండి జైలుకు వెళ్తే.. పిల్లల ఇబ్బందులు వర్ణణాతీతం. ప్రభుత్వం ప్రజల్లో మార్పునకు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నా.. మార్పు కనిపించడం లేదు. ఆడపిల్లలు పుట్టారని ఒకచోట.., డబ్బు, ఆస్తుల పంపకంలో తేడా రావడంతో మరో చోట హత్యలకు పాల్పడి జైలుకు వెళ్తున్నారు. గత నాలుగేండ్లలో జిల్లాలో 62 హత్యలు జరిగాయి. 2018లో 9, 2019లో 12, 2020లో 23, 2021లో 18 హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మచ్చుకు కొన్ని..