e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిల్లాలు వ్యవసాయానికి రోబో

వ్యవసాయానికి రోబో

  • స్టార్టప్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌
  • వివిధ రంగాల్లో 25కు పైగా ఇంక్యుబేటర్లు
  • ఔత్సాహిక స్టార్టప్‌లకు నిరంతర ప్రోత్సాహం
  • పెట్టుబడిదారులతో సమావేశాలు
  • ఆయా రంగాల నిపుణులతో అనుభవ పాఠాలు
  • పంట పొల్లాల్లో కలుపు తొలగింపు సులువు
  • ఎరువుల పిచికారీ, విత్తనాలు, మొక్కలు నాటొచ్చు..
  • ట్రయల్‌ రన్‌లో రసాయనాల పిచికారీ విజయవంతం
  • ఎక్స్‌ – మిషన్‌ అంకుర సంస్థ నిర్వహణలో రూపకల్పన

మీరు కొత్త కంపెనీ పెట్టాలనుకుంటున్నారా.. ? అయితే డబ్బుల్లేవని చింతించొద్దు. మీ ఆలోచనే పెట్టుబడి. తెలంగాణ రాష్ట్రంలో ఇదే కొత్త ఒరవడి. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మీ ఆలోచనను వ్యాపారంగా మలచవచ్చు. మీ ఆలోచనను కార్పొరేట్‌ ప్రపంచంలోకి తీసుకుపోయేందుకు ఇంక్యుబేటర్స్‌ వేదికగా ఉన్నాయి. నిపుణుల పర్యవేక్షణలో వ్యాపారసూత్రాలను అలవర్చుకుని, చిన్న వయసులోనే పెద్ద కంపెనీలను సృష్టించొచ్చు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా మరో నలుగురికి ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదుగవచ్చు. యువతరంలో ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తూ హైదరాబాద్‌ అడ్డాగా స్టార్టప్‌లకు సర్కారు రెడ్‌ కార్పెట్‌ పరుస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో బహుళ జాతీయ కంపెనీలకు దీటుగా స్టార్టప్‌ కంపెనీలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్లికేషన్లను, మొబైల్‌ యాప్‌లను రూపొందిస్తూ దేశ, విదేశాల్లో వాటిని మార్కెటింగ్‌ చేసుకునే స్థాయికి ఎదగటం గమనార్హం.

కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌16 : వ్యవసాయ రంగంలో శాస్త్ర, సాంకేతికత పెరుగుతోంది. ఎక్స్‌-మిషన్‌ అనే అంకుర సంస్థ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఈ) పరిజ్ఞానంతో మొబైల్‌ రోబోను రూపొందించింది. దీంతో కూలీల కొరతను అధిగమించి పని, ఆర్థికభారం తగ్గించుకోవచ్చు. ఎక్స్‌-రోబొటిక్‌ వ్యవసాయ పనులకు అందించే యాప్‌, విత్తనాలు నాటుట, కలుపు మొక్కలు తొలగింపు, పురుగుల మందు పిచికారి వంటి పనులను రోబోలను ఉపయోగించి చేయవచ్చు. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిహబ్‌ ఆధ్వర్యంలో ఈ రోబోను మొక్కజొన్న పైరులో ప్రయోగించి చూశారు. పొలంలో వరసల(సాళ్ల) మధ్య వదిలితే అది మొక్కజొన్న మొక్కలను మాత్రమే గుర్తించి ఇతర మొక్క కనిపిస్తే దానిపై కలుపు నివారణ మందును పిచికారీ చేసింది. రెండో దశలో జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలో రైతుల క్షేత్రప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -

సిటీబ్యూరో, సెప్టెంబరు 16 (నమస్తే తెలంగాణ): స్టార్టప్‌ కంపెనీలకు క్యాపిటల్‌ సిటీగా హైదరాబాద్‌ మారింది. గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (త్రిబుల్‌ ఐటీ) కేంద్రంగా మొదలైన స్టార్టప్‌ల ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత త్రిబుల్‌ ఐటీలో స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్‌ సెంటర్‌గా ఉన్న సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూషిప్‌ (సీఐఈ)ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం టీ-హబ్‌ (టెక్నాలజీ హబ్‌)ను భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. ఒకేసారి వందలాది స్టార్టప్‌లకు టీ-హబ్‌ కేంద్రంగా మారింది. మన రాష్ట్రం నుంచే కాకుండా, దేశ, విదేశాలకు చెందిన వారు కూడా టీ-హబ్‌కు క్యూ కట్టారు. దీంతో స్టార్టప్‌లకు హైదరాబాద్‌ అనుకూలమనే ముద్ర పడింది. స్టార్టప్‌ కంపెనీలను ప్రొత్సహించేందుకు ఇంక్యుబేటర్స్‌ కూడా హైదరాబాద్‌ కేంద్రంగా పుట్టుకువచ్చాయి.

టీ-హబ్‌ ఏర్పాటుతో…

తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యతిస్తూ టీ – హబ్‌ పేరుతో ప్రారంభించిన ఇంక్యుబేషన్‌ సెంటర్‌తో హైదరాబాద్‌లో ఒక్కసారిగా స్టార్టప్‌ బూమ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత టెక్నాలజీ స్టార్టప్‌లతో పాటు వివిధ రంగాల స్టార్టప్‌లను కూడా సర్కారు ప్రోత్సహించింది. దాంతో బయో హబ్‌, అగ్రీ హబ్‌, ఇలా విభిన్న రంగాల ఇంక్యుబేటర్లు వచ్చాయి. ఇటీవలే రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రీ హబ్‌ను ప్రారంభించారు. టీ-హబ్‌కు విపరీతమైన స్పందన ఉండడంతో ప్రభుత్వం 3.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో టీ-హబ్‌ రెండో దశ నూతన భవనాన్ని నిర్మిస్తోంది.

వ్యవసాయంపైనే దృష్టి

టెక్నాలజీతో వండర్స్‌ సృష్టించిన స్టార్టప్‌లు ఇప్పుడు వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాయి. ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే ఔత్సాహికులకు అండగా నిలిచేందుకు హైదరాబాద్‌ కేంద్రంగానే 7 ఇంక్యుబేటర్స్‌ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో పాటు విద్యాసంస్థలు, ప్రైవేటు కంపెనీలు వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తమ ప్రాంగణంలో ఇంక్యుబేటర్స్‌ను ఏర్పాటు చేశాయి.

హైదరాబాద్‌లో ఉన్న ఇంక్యుబేటర్స్‌

టీ-హబ్‌ వీ – హబ్‌ బయో హబ్‌
సీఐఈ (గచ్చిబౌలి త్రిబుల్‌ ఐటీ) డీ ల్యాబ్స్‌- ఐఎస్‌బీ హైదరాబాద్‌ ఐ హబ్‌ – ఎంఎన్‌ పార్క్‌ జె హబ్‌ – జెఎన్‌టీయూ లైఫ్‌ సైన్సెస్‌ ఇంక్యుబేటర్‌… ఐకేపీ పార్క్‌ సొసైటీ ఫర్‌ బయోటెక్నాలజీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌.. సీఎస్‌ఆర్‌-ఐఐసీటీ టీ వర్క్స్‌… బేగంపేట ఎస్‌ఆర్‌ ఇన్నోవేషన్‌ ఎక్చేంజ్‌ (శ్రీఎక్స్‌) ఎంఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌- ఎంఎన్‌ఆర్‌ విద్యా సంస్థలు మెడ్‌ టెక్‌ ఇంక్యుబేటర్‌- త్రిబుల్‌ ఐటీ హైదరాబాద్‌ బయోనెస్ట్‌ -యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఉస్మానియా టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌- ఉస్మానియా విశ్వవిద్యాలయం

జీటీఎం బడ్డీకి రూ.14కోట్ల సీడ్‌ ఫండ్‌

సిటీబ్యూరో, సెప్టెంబరు 14 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభమైన జీటీఎం బడ్డీ స్టార్టప్‌ సీడ్‌ ఫండ్‌ కింద రూ.14 కోట్లను సమీకరించుకుంది. శ్రీధర్‌ పెద్దినేని, శాంటా థౌనయోజం, సుందర్‌ వల్లై చామీ, చంద్రమణి తివారీలు 2020లో జీటీఎం బడ్డీని ప్రారంభించారు. సేల్స్‌ టెక్‌ స్టార్టప్‌గా ప్రారంభమైన జీటీఎం బడ్డీ సాఫ్ట్‌వేర్‌ యాప్‌ ఎ సర్వీస్‌ (సాస్‌)గా గుర్తింపు పొందింది. స్టెల్లారీస్‌ వెంచర్‌ పార్టనర్స్‌ నేతృత్వంలోని సీడ్‌ఫండింగ్‌ రౌండ్‌ 2లో కొత్తగా రూ.14 కోట్లను ( 2మిలియన్‌ డాలర్లు) సమీకరించింది. ఈ సందర్భంగా జీటీఎం బడ్డీ ఫౌండర్‌ శ్రీధర్‌ పెద్దినేని మాట్లాడుతూ ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్‌ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌తో విక్రయదారులు, కొనుగోలుదారులకు సరైన సమయంలో అవసరమైన సమాచారాన్ని అందిస్తుందన్నారు. కాగా జీటీఎం బడ్డీ స్టార్టప్‌ను ప్రారంభించకముందు శ్రీధర్‌ పెద్దినేని హోస్ట్‌ అనలిటిక్స్‌, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వంటి స్టార్టప్‌లను ప్రారంభించగా, వాటిని వెక్టర్‌ క్యాపిటల్‌ కొనుగోలు చేసింది. ఆ తర్వాత గెయిన్‌సైట్‌ను ప్రారంభిస్తే దాన్ని విస్టా ఈక్విటీ పార్టనర్స్‌ కొనుగోలు చేసింది. తాజాగా జీటీఎం బడ్డీపై శ్రీధర్‌ పెద్దినేని నేతృత్వంలోని బృందం ప్రత్యేకంగా పని చేస్తూ, దేశ, విదేశాల్లో కార్యకలాపాలను విస్తరించే పనిలో ఉన్నారు.

స్టార్టప్‌లపై 3 వారాల శిక్షణ గచ్చిబౌలి త్రిబుల్‌ ఐటీ -సీఐఈలో నిర్వహణ

సిటీబ్యూరో, సెప్టెంబరు 16 (నమస్తే తెలంగాణ) : విద్యార్థి దశలోనే స్టార్టప్‌లపై పూర్తి అవగాహనకు శిక్షణా కార్యక్రమాన్ని గచ్చిబౌలి త్రిబుల్‌ ఐటీలోని సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూషిప్‌(సీఐఈ)లో నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణను అటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (ఏఐసీ) సహకారంతో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కొత్త ఆలోచనతో స్టార్టప్‌ ప్రారంభించాలనుకునే విద్యార్థులకు మూడు వారాల శిక్షణ ఇవ్వనున్నారు. ప్రారంభ్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ శిక్షణకు స్టార్టప్‌లపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫోన్‌ 7013002266, లేదా aiciiith<\@>gmail.com లో సంప్రదించాలని తెలిపారు.

తాటివనంలో పచ్చని పైర్లు

గీత కార్మికుల ఉపాధికి కేరాఫ్‌ అడ్రస్‌గా పేరొందిన చిత్రియాల ప్రాంతం నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నది. నల్లమల అటవీ ప్రాంత పరిధిలో ఉండడంతో వందలాది గీతకార్మికులు కల్లు గీస్తూ ఆదాయాన్ని పొందేవారు. రాష్ట్ర ప్రభుత్వం 24గంటల పాటు ఉచిత విద్యుత్‌, రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుండడంతో బోర్లు వేసి వరి, ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. దాంతో ఈ ప్రాంతం పచ్చదనంతో అలరారుతున్నది.

పని విధానం…

కూలీలు లేకుండా అరచేతిలో రిమోట్‌ కంట్రోల్‌తో పంటపొలాల్లో ఈ కృత్రిమ రోబొటిక్‌ మిషన్‌తో అన్ని పనులూ చేయవచ్చు. నిర్ధిష్టమైన లోతు, దూరములో విత్తనాలు, మొక్కలను నాటేందుకు అనువుగా ఉంటుంది. కెమెరాల వంటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించి పొలంలో కలుపు మొక్కలను తొలగిస్తుంది. సాఫ్ట్‌వేర్‌ను సెల్‌ఫోన్‌తో అనుసంధానం చేసి రోబోను రిమోట్‌ సహాయంతో కంట్రోల్‌ చేస్తుంది. మొక్కలు నాటేటప్పుడు దీని సాయంంతో రసాయనాలు చల్లి కలుపు నియంత్రివచ్చు. అతి తక్కువ మోతాదులో రసాయనాల వినియోగం ఉంటుంది.

పరికరం సామర్థ్యం

40 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును ఈ మిషన్‌పై అమర్చుతారు. ఇందులో రసాయనాల మిశ్రమాన్ని నింపితే మొక్కకు సరిపడు పిచికారీ చేస్తుంది. 600 వాల్ట్‌ కలిగిన బ్యాటరీతో 100 కిలోల బరువుతో రూపొందించిన ఈ రోబో ఖరీదు రూ.లక్షా 20 వేల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ సహాయంతో రైతులకు సబ్సిడీ వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

వానకాలం నాటికి అందుబాటులోకి..

వ్యవసాయంలో నూతన మార్పులు తీసుకురావడానికి తమ ప్రయోగం విజయవంతం అయింది. రోబొటిక్‌ మిషన్‌తో తక్కువ సమయంలో ఎక్కువ పని చేయొచ్చు. పెట్టుబడులు, రసాయనాల వినియోగం కూడా తగ్గుతుంది. వచ్చే వానకాలం నాటికి మార్కెట్లోకి తీసుకువస్తాం.

  • త్రివిక్రమ్‌ కుమార్‌ డొక్క, ఎక్స్‌-మిషన్‌ సీఈవో

వ్యవసాయరంగం ఇంక్యుబేటర్స్‌
ఏజీ హబ్‌- పీజేటీఎస్‌ఎయూ
ఎ-ఐడియా-ఐసీఎఆర్‌-ఎన్‌ఎఎఆర్‌ఎం
అగ్రి బిజినెస్‌ ఇంక్యుబేటర్‌-ఇక్రిశాట్‌
సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ అగ్రిప్రెన్యూర్‌షిప్‌- మేనేజ్‌
న్యూట్రీ హబ్‌- ఐఐఎంఆర్‌
అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌- ఐఐఐటీ హెచ్‌
ఎఐఎస్‌ఈఎ- ఐఐటీహెచ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement