పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ సంకల్పం
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
త్వరలోనే అందుబాటులోకి ఖైరతాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి :ఎమ్మెల్యే దానం
మహాభారత్‌నగర్,గురుబ్రహ్మనగర్‌లో బస్తీ దవాఖానలు ప్రారంభం
ఖైరతాబాద్/బంజారాహిల్స్, డిసెంబర్ 3 : పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ సంకల్పమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఖైరతాబాద్‌లోని మహాభారత్నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి. విజయారెడ్డి, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె. ప్రసన్న రామ్మూర్తితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా వైద్య పరీక్షలను చేయించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశం లో మేయర్ మాట్లాడుతూ ఉచిత వైద్యం పేదల వద్దకు చేర్చేందుకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 226 విజయవంతంగా నడుస్తున్నాయని, తాజాగా మరో 32 ఏర్పాటు చేశామన్నారు. ఇంకా 35 బస్తీ దవాఖానల కోసం స్థల పరిశీలన జరుగుతున్నదన్నారు. సాధారణ జబ్బులతో పాటు మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు సైతం ఉచితంగా మందులను అందజేస్తున్నామన్నారు. ఇటీవల టెలీ కన్సల్టేషన్ సౌకర్యం కూడా కల్పించామన్నారు. ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ త్వరలోనే ఖైరతాబాద్‌లో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ దవాఖానను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 17 డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, ఏఎంవోహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ, కార్డియాలజిస్ట్ డాక్టర్ రఘు, ఎంఎస్ మక్తా పీహెచ్సీ డాక్టర్ సువర్ణ, బస్తీ దవాఖాన వైద్యులు డాక్టర్ ఆంజనేయులు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, నాయకులు వైల ప్రవీణ్ కుమార్, గజ్జెల అజయ్, గజ్జెల రమేశ్, సత్యనారాయణ, మహేశ్ యదవ్, శ్రీనివాస్ యదవ్, కరాటే రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
బస్తీ దవాఖానలో ఉచిత వైద్య సేవలు: ఎమ్మెల్యే నాగేందర్
జీహెచ్ఎంసీ పరిధిలో నివాసం ఉంటున్న పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని గురుబ్రహ్మనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..చిన్న చిన్న జబ్బులకు చికిత్సతో పాటు సుమారు 53 రకాలైన వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీహెచ్వో డా.అనురాధ, బస్తీ దవాఖాన వైద్యురాలు డా. చంద్రలేఖ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్, ప్రధాన కార్యదర్శి మాదాస్ ఆనంద్‌కుమార్, జావెద్,ప్రేమ్, శౌరిరాజు, అశ్వక్,వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.