నారాయణపేట, జనవరి 3: భర్త సహకారంతో మహిళలకు, పురుషులతో సమానంగా విద్యావకాశాలు కల్పించడానికి సావిత్రిబాయిఫూలే కృషి చేశారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మెర్సీవసంత అన్నారు. సోమవారం సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆమె చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మహిళల విద్యకోసం, హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం నిరంతరం సావిత్రిబాయిఫూలే ఉద్యమించారన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారు లు భాస్కర్‌రెడ్డి, సంధ్యారాణి, అశోక్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో…
స్త్రీల విద్యాభివృద్ధ్దికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలే అని పీడీఎస్‌యూ జిల్లా కోశాధికారి గౌస్ అన్నారు. సోమవారం సావిత్రీబాయిఫూలే జయంతి సందర్భంగా పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మార్కెట్ లైన్ హైస్కూ ల్, కంసాన్పల్లిలోని హైస్కూల్లో ఆమె చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ కళాశాల అధ్యక్షుడు గణేశ్, నాయకులు ప్రశాం త్, సూర్యనారాయణ, అనిల్, రూప, అనిత, శిరీష, శోభ, మహాలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
పీఆర్టీయూ ఆద్వర్యంలో..
నారాయణపేటరూరల్, జనవరి 3: పేట జిల్లా కేంద్రం లోని మండల వనరుల కేంద్రంలో సోమవారం జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅథితిగా డీఈవో శ్రీనివాస్‌రెడ్డి హాజరై సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. విశిష్ట సేవలందించిన మహిళా ఉపాధ్యా యులను సంఘం తరఫున సన్మానించారు. జీసీడీవో పద్మనళిని, నాయకులు జనార్దన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రఘువీర్, వెంకట్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, జనార్దన్, భాస్కర్, మహిళా నేతలు వరలక్ష్మి, వాణిశ్రీ, పారిజాత, శ్రీదేవి, మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్‌లో..
ఊట్కూర్, జనవరి 3 :మండలంలోని పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. ఓబ్లాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురునాథ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయిని అరుంధతిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలోహెచ్ఎంలు, ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి, విజయలక్ష్మి, నర్సింహ పాల్గొన్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద జనవరి 3: మండల కేంద్రంలో సావిత్రిబాయిఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకోసం చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో యువకులు మహేశ్, ఎంబీ అనిల్, భీమప్ప, శ్రీనివాస్, సురేశ్ పాల్గొన్నారు.
మక్తల్‌లో..
మక్తల్ టౌన్, జనవరి 3: మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సావిత్రిబాయి చిత్రపటానికి టీఆర్ఎస్ నాయ కులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్బంగా మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో నియోజక వర్గ అధికార్ర పతినిధి రామలింగం, కౌన్సిలర్లు మొగిలప్ప, జగ్గలి రాములు, నాయకులు మజర్,సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
మరికల్లో..
మరికల్, జనవరి 3: మండల కేంద్రంలో సావిత్రి బాయిఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో మహిళలకు విద్యనందించాలని పోరాడిన ధీరవనిత సావిత్రిబాయి అని బీఎస్పీ నారాయణపేట ని యోజకవర్గం ఇన్చార్జి శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, మండల అధ్యక్షు డు రామాంజనేయులు, నాయకులు రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడలో..
ధన్వాడ, జనవరి 3: ధన్వాడ కేజీబీవీలో సోమవారం సావిత్రిబాయిఫూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జీహెచ్ఎం రమేశ్, లక్ష్మణ్ తదితరు లు పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో..
కృష్ణ, జనవరి 3: నాటి సమాజ కట్టుబాట్లను ధిక్కరించి స్త్రీలకోసం పాఠశాలలు నిర్మించి పాఠాలు నేర్పిన విద్యాదేవత సావిత్రీబాయి ఫూలే అని హెచ్ఎం నిజాముద్దీన్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయిఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. . ప్రతిఒక్కరూ ఆమె ఆశయ సాధన కు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.