కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్, డిసెంబర్ 23: ప్రస్తుత సీజన్లో వరికి బదులుగా ఇతర పంటల విత్తనాలను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ హరిచందన సూచించారు. గురువారం పట్టణంలో ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏఏ రకాల విత్తనాలు ఉన్నాయో పరిశీలించి పండ్లు, కూరగాయలు, మినుములు, వేరుశనగ, పెసర తదితర పంటలకు సంబంధించిన విత్తనాలు ఉంచుకోవాలని దుకాణా దారులను ఆదేశించారు. దుకాణాల్లో ఎరువులు, విత్తనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, సూచిక బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్‌సుధాకర్, ఏవో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గుణాత్మక విద్యను అందించాలి
నారాయణపేట టౌన్, డిసెంబర్ 23:విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని కలెక్టర్ హరిచందన పేర్కొన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎస్వీపీ హైదరాబాద్, సంకృత ఫౌండేషన్ సభ్యులతో గురువారం కలెక్టర్ హరిచందన సమావేశం నిర్వహించారు. జిల్లాలో సమ్మిళిత విద్యాభివృద్ధి, వనరుల కల్పన, ఉపాధి తదితర అంశాలకు సంబంధించి ఫౌండేషన్ సభ్యులు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి, మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులతో ఒ ప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఎస్వీపీ సభ్యుడు సాయిప్రసాద్ మాట్లాడుతూ అంకురం అనే కార్యక్రమం ద్వారా రానున్న 5 ఏండ్లల్లో వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమా లు చేపట్టనున్నట్లు చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల అభివృద్ధ్ది కోసం అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సునీత, నీలిమ, అమ్రపాలి, హెగ్డే, అకాడమిక్ మానిటరింగ్ అధికారి విద్యాసాగర్, సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాలికావిద్య కోసం కృషి చేయాలి
బాలికా విద్య కోసం కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గురువారం రూం టూ రీడ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికావిద్య అనే కార్యక్రమం నిర్వహించి బాలికావిద్య ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు అనే అంశంపై నాటికను ప్రదర్శించారు. మెటీరియల్ గ్యాలరీ వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో డీఐవో శైలజ, ఎంఈవోలు, సఖీ చైల్డ్‌లైన్ సభ్యులు పాల్గొన్నారు.