
మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 22 : పాలమూరు యూనివర్సిటీలో బుధవారం గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యం లో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి నాగరాజు, అధ్యాపకులు మధు, సురేశ్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఆదిత్య కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయ ఆవరణలో రామానున్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఈవోలు వెంకట య్య, రాజునాయక్, లక్ష్మణ్‌సింగ్, జయశ్రీ, నాగయ్య, ట్ర స్మా అధ్యక్షుడు ప్రభాకర్ పాల్గొన్నారు. అలాగే వాగ్దేవి జూనియర్ కళాశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా గణితశాస్త్ర అధ్యాపకులను కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం రాఘవేంద్రరావు, నాగేందర్, కోట్ల శివకుమార్, ప్రిన్సిపాల్ గీతాదేవి, ఐఐటీ నీట్ అకాడమీ ఇన్చార్జి పావని తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, డిసెంబర్ 22 : మండలంలోని లింగన్నపల్లి ప్రాథమిక పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాసులు, సర్పంచ్ వెంకటేశ్, పీఆర్టీయు మహిళా విభాగం మండల కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, డిసెంబర్ 22 : మండలంలోని తాటికొండ ఉన్నత పాఠశాలలో గణితశాస్త్ర పితామహుడు రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రా మానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం శంకరాచారి, వ్యాయామ ఉపాధ్యాయుడు నిరంజన్, యాదయ్య పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, డిసెంబర్ 22 : మండలంలోని డో కూర్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో రామానుజ న్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే తపోవన్ పాఠశాలలో ప్రిన్సిపాల్ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో రా మానుజన్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ ఎం నాగేందర్, ఉపాధ్యాయులు శ్యాంమోహన్, శ్రీపాల్‌రెడ్డి, లచ్చయ్య, ధమయంతి, అరుణ, అన్వర్‌పాషా పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, డిసెంబర్ 22 : పట్టణంలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ బొటానికల్ గార్డెన్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ రవీందర్రావు, ఉదయ్‌కుమార్, మంజుల, మాధవి, లత, సింధు, భార్గవిలత, రామకృష్ణ పా ల్గొన్నారు. అలాగే నాగసాల శివారులోని స్వామి నారాయణ్ గురుకుల్లో రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం గణితశాస్త్ర ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు. కార్య్రమంలో ప్రిన్సిపాల్ శ్రీధర్‌బాబు, అక్షర భగత్జీ, సీసీఏ ఇన్చార్జి సాకేత్ ప్రవీణ్ పాల్గొన్నారు.