బడంగ్‌పేట, పహాడీషరీఫ్ : అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఓ వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన బాలు (29) పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో నివాసముంటున్నాడు.
రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు అతను ఉంటున్న ఇంట్లో నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనంతరం బాలును రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.