బషీరాబాద్, ఆగస్టు 9: వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎక్కడికి వెళ్లిన ఒకరికి ఒకరూ చెప్పుకునేవారు, ఒకరికి తెలియనిది మరొకరు ఎక్కడికి వెళ్లేవారుకారు. ఇంతగా స్నే హంగా ఉన్న వారి మధ్య ఓ ప్రేమ వ్యవహరం స్నేహితుడి ప్రాణం తీసేవరకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలందర్రెడ్డితో కలిసి డీఎస్పీ కార్యాలయంలో వివరించారు. మండల కేం ద్రం గోసాయి కాసాయి కాలనీకి చెందిన జుబేర్ అహమ్మద్(26), మహమ్మద్‌లు మంచి స్నేహితులు. అయితే జుబేర్ అహమ్మద్, మహమ్మద్ మామ కూతురును ప్రేమిస్తున్నా డని, పెళ్లి చేసుకొమ్మని వెంటపడుతూ సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడని తెలిపారు. పలుమార్లు హెచ్చరించిన అతడిలో మార్పు కనిపించలేదన్నారు. అంతేకాకుండా మృతుడు జుబేర్ గతంలో ఓ హోటల్ యజమాని కూతురిని ప్రేమించి పెండ్లి చేసు కో కుండా, ఆమెకు పెండ్లి అయిన తరువాత కూడా ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపాడు. సదరు మహిళ భర్త విడాకులు ఇవ్వగా, ఆమెకు మరో పెండ్లి చేసినప్పటికీ మార్పు రాక పోవడంతో తన మామ కూతురి విషయంలో కూడా అలాగే చేస్తున్నాడనే ఆక్రోశముతో అతనిని ఎలాగైనా చంపాలనే నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ నెల ఐదోతేదీ తెల్ల వారుజామున బషీరాబాద్-జీవన్గి రోడ్డు మార్గంలో కాపు కాసి, జుబేర్ బైక్‌పై వెళ్లు తుం డగా అతడిని ఆపి లిప్టు అడిగి వెనుక కూర్చొని కొద్ది దూరం వెళ్లాక ఎల్లమ్మ గుడి దగ్గర తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసి పరారైనట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుడిని ఆదివారం తాండూరు రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకుని ఒక కత్తి, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సోమవారం న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. సమావేశంలో ఎస్సై విద్యాచరణ్‌రెడ్డి ఉన్నారు.