పిట్లం/ఎల్లారెడ్డి/గాంధారి/నాగిరెడ్డిపేట్/తాడ్వాయి/బిచ్కుంద, జనవరి 9: జిల్లాలో రైతుబంధు సంబురాలు కొనసాగుతున్నాయి. అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ చిత్రపటాలకు ఆదివారం రైతులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు. పిట్లం మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద చైర్పర్సన్ లక్ష్మీబాయి బాబూసింగ్ పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, విండో చైర్మన్లు శపథంరెడ్డి, నారాయణరెడ్డి, సాయిరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు ఉడుగుల రాములు, బెజుగం జగదీశ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి వజీరుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు, హమాలీలు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జాజాల సురేందర్ చిత్రపటాలకు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. సంబురాల్లో టీఆర్ఎస్ నాయకులు జలంధర్‌రెడ్డి, అరవింద్ గౌడ్, రవీందర్ గౌడ్, ఎరుకల సాయిలు, మామిడి దామోదర్, రైతులు, మహిళలు పాల్గొన్నారు.
గాంధారిలో సింగిల్ విండో కార్యాలయం నుంచి ప్రభుత్వ దవాఖాన వరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీపీ రాధాబలరాం, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సంజీవ్, విండో చైర్మన్ సాయికుమార్, ఏవో యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దుర్గం శివాజీ, వైస్ ఎంపీపీ భజన్‌లాల్, గండివేట్ సర్పంచ్ ఫారూక్, ఎంపీటీసీ పత్తి శ్రీను, ముకుంద్‌రావు, కాలభైరస్వామి ఆలయకమిటీ చైర్పర్సన్ మాలతీ సంతోష్, విండో డైరెక్టర్ తాడ్వాయి సంతోష్, ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యం, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్తఫా, గాంధారి ఉప సర్పంచ్ రమేశ్, వంజరి శంకర్, సంగని బాలయ్య, రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలోని మాతుసంగెం గ్రామంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జాజాల సురేందర్ చిత్రపటాలను ఎడ్లబండిపై ఊరేగించారు. కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్, మాజీ విండో చైర్మన్ ముకుంద్‌రావు, ఉప సర్పంచ్ సంగారావు, సంగమేశ్, రైతులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంలో మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ నర్సింహులు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్పర్సన్ బోయిని రాధ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రాజారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు వాసురెడ్డి, రామకృష్ణ, నాయకులు విఠల్, కిరణ్, కాంతం, వెంకట్‌రెడ్డి, సంతోష్‌గౌడ్ పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్ రైతువేదికలో ఎంపీపీ రవి, ఐడీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్‌రెడ్డి, ఎంపీటీసీ జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ నర్సింహులు, సర్పంచ్ నర్సారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మహిపాల్, నాయకులు నారాయణ, ధర్మారెడ్డి, లక్ష్మారెడ్డి, రమేశ్‌రావు పాల్గొన్నారు.
బిచ్కుంద మండలం పెద్దదేవాడ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంతకు ముందు గ్రామంలో నిర్మించిన రైతువేదికను ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఎంపీపీ అశోక్‌పటేల్, జడ్పీటీసీ భారతీరాజు, సర్పంచ్ శివానందప్ప, సొసైటీ చైర్మన్లు బాలజీ, ప్రహ్లాద్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఖాతాల్లో 50వేల కోట్లు జుక్కల్ ఎమ్మెల్యే షిండే
పంట పెట్టుబడి కింద రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో సోమవారం నాటికి రూ.50వేల కోట్లు జమ కానున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే తెలిపారు. రైతులను అప్పుల బాధ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. బిచ్కుంద మండలం పెద్దదేవాడ గ్రా మంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఆయన మాట్లాడారు. అన్నదాత సంక్షేమం కోసం సీఎం కేసీఆర్.. చెరువుల పునరుద్ధరణ, ఉచిత కరెంటు, రైతువేదికలు, రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.
రైతుబంధు దేశానికే ఆదర్శంఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల
గాంధారి, జనవరి 9 : రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం.. దేశానికే ఆదర్శమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గాంధారి మండల కేంద్రంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ రైతుపక్షపాతి అని, పెట్టుబడి సాయం కింద ఎనిమిది సీజన్లలో ఇప్పటి వరకు రూ. 50 వేల కోట్లు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమచేశారని తెలిపారు. రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందజేస్తున్నారని గుర్తుచేశారు.
రైతును రాజు చేయడమే లక్ష్యం డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి
రైతుకు అండగా నిలిచి రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. బిచ్కుంద మండలం పెద్దదేవాడ గ్రామంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని, దీంతో బీజేపీ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని అన్నా రు. రైతులపై ప్రతిపక్షాలు సవతితల్లి ప్రేమను చూపుతున్నాయని ఆరోపించారు. వారి మాటలను రైతులు నమ్మడంలేదని అన్నారు.