గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం అంబర్‌పేట డివిజన్లోని హైమద్‌నగర్‌లో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌తో పాటు అధికారులతో కలసి ఆయన క్షేత్రస్థాయిలో పాదయాత్ర నిర్వహించారు.
స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. లో-ఫ్రెషర్ మంచినీటి సమస్యతో పాటు కొత్త రోడ్డు వేయాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.తన దృష్టికి వచ్చిన సమస్యలు వీలైనంత తొందరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నా మన్నారు. రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్ల ఏర్పాటు, పార్కులు సుందరీకరణ తదితర పనులను వేగవంతం చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు జాకీబాబు, ప్రవీణ్‌పటేల్, మహేష్‌ముదిరాజ్, సలీం, మోసిన్, బాబా, విష్ణు, తిరుపతి, నాగరాజె, జమీల్, హైమద్, సంతోష్‌చారి తదితరులు పాల్గొన్నారు.