
హన్వాడ, డిసెంబర్ 24 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతి నెలకు గ్రామ పంచాయతీలకు అభివృద్ధి నిధులు విడుదల చేస్తున్నది. దీంతో పల్లెలు అభివృద్ధి బాటలో కొనసాగుతున్నాయి. నెల నెలా నిధులు పుష్కలంగా విడుదల చేయడంతో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ప్రతి గ్రామంలో రూ.12,60 లక్షలతో శ్మశానవాటికలు, రూ.2,50లక్షలతో డంపింగ్ యార్డు లు, రూ.2 లక్షలతో పల్లె ప్రకృతి వనాలు, రూ 22లక్షలతో రైతు వేదికలు, రూ.15లక్షలతో నూతన గ్రామ పంచాయతీలు, కారంతండా బ్రిడ్డి రూ.కోటి 40లక్షలతో నిర్మాణం, ప్రతి మండలకేంద్రానికి బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం రూ.42లక్షలు, మండలకేంద్రంలో రూ.60లక్షలతో రైతుబజార్, రూ.120లక్షలతో మటన్ మార్కెట్, ఓపెన్ జిమ్ రూ.25లక్షలతో నిర్మాణం చేపట్టారు. వీటితో పాటు గ్రామా ల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడం జరిగుతున్న ది. ఏ గ్రామానికి వెళ్లినా హరిత వనం, రోడ్లు, డ్రైనేజీలు దర్శనమిస్తాన్నాయి.
ఎప్పుడూ జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే పల్లెలు కళకళలాడుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామాలకు రోడ్లు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా రో డ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికీ నల్లాతోపాటు శుద్ధ జలం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధిలో గ్రామాలు
ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మంజూరు చేయడంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం, రోడ్లకు ఇరువైపులా మొక్కలు దర్శనమిస్తాయి. ఏ వార్డులకు వెళ్లినా అభివృద్ధి కనబడుతున్నది. గతంలో ఇన్ని నిధులు వచ్చేవి కావు. నిధులు పుష్కలంగా రావడంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. గతం కంటే గ్రామాలు అభివృద్ధిలో ఉన్నాయి.
పంచాయతీలకు నిధులు పుష్కలం
నెలనెలా పంచాయతీలకు నిధులు పుష్కలంగా వస్తున్నాయి. గ్రామాల్లో నిధులకు సరిపడా పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వాలు ఇన్ని నిధులు వచ్చేవి కావు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు బాధ్యతగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. నిధులపై కూడా ప్రత్యేక నిఘూ ఉంది. ప్రస్తుతం పల్ల్లెలు అభివృద్ధి బాటలో ఉన్నాయి. ప్రతిరోజూ చెత్త సేకరణ, పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి.