
రామాయంపేట, డిసెంబర్ 23: అంగన్వాడీల శ్రమను ప్రభు త్వం గుర్తించి స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్నారని మెదక్ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రామాయంపేటకు విచ్చేసిన ఎమ్మెల్యే రామాయంపేట ప్రాజెక్టు పరిధిలోని 7 మండలాల పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రాజెక్టు పరిధిలోని ఏడు మండలాలు రామాయంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట, మసాయిపేట, వెల్దుర్తి, చిన్నశంకరంపేటలో పనిచేస్తున్న 280 మంది టీచర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశామన్నారు. ప్రతి కార్యకర్త అంగన్వాడీకి వచ్చే పిల్లలకు సరైన పౌష్టికాహారం అందజేయాలన్నారు. ఫోన్ వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయన్నారు. ఎక్క డి కెళ్లినా వెంటనే సమాచారం చేరవేయొచ్చు అని తెలిపారు. కార్యక్రమంలో రామాయంపేట ఐసీడీఎస్, సీడీపీవో స్వరూప, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఎంపీపీ భిక్షపతి, ఏ ఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, ఎంపీపీ స్రవంతి, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, తహసీల్దార్ శేఖర్‌రెడ్డి, ఐసీడీఎస్ ఎగ్జిక్యూటీవ్ అధికారి సువర్ణ, కౌన్సిలర్ గజవాడ నాగరాజు, సర్పంచ్, ఎంపీటీసీలు న సూపర్వైజర్లు ఉన్నారు.
క్రిస్మస్ వేడుకలో మెదక్ ఎమ్మెల్యే …
చేగుంట, డిసెంబర్ 23: భక్తి శ్రద్ధలతో క్రిస్మన్ వేడుకలను జరుపుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. నార్సింగి మండల పరిధిలోని జెప్త్తిశివునూర్లో వైస్ ఎంపీపీ సుజాత ఆధ్వర్యంలోనిర్వహించిన క్రిస్మస్ వేడుకలో మెదక్ ఎమ్మెల్యే పాల్గొని కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సబిత,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబు,వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు,ఎంపీటీసీలతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు
అన్ని మతాల సంక్షేమమే ప్రభుత్వధ్యేయం
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
పెద్దశంకరంపేట, డిసెంబర్23: అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మె ల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. రైతువేదిక భవనంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు గిప్ట్ ప్యాకులను మహిళలకు అందజేసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం దసరా, రంజాన్, కిస్మస్ పండుగలకు దుస్తులు అందజేస్తుందన్నారు.
అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
మండలంలోని 72 అంగన్వాడీ టీచర్లకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఈ ఫోన్లో యాప్‌ద్వారా లబ్ధిదారులకు అందించే సేవలను నిత్యం నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. అంగన్వాడీ టీచర్లకు గత ప్రభుత్వ హయంలో రూ.5000 జీతం వచ్చేదని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మూడు విడుతలుగా జీతాలు పెంచుతూ ప్రస్తుతం రూ.13650 గౌరవ వేతనం చెల్లిస్తుందన్నారు. ఆయాలకు గతంలో రూ.2000 మాత్రమే ఉండేదని ప్రస్తుతం మన ప్రభుత్వం రూ.7850 చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, మాజీ. ఎంపీపీ రాజు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, రైతు బంధు మండల అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, ఎంపీటీసీ వీణా సుభాశ్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.