కడ్తాల్, డిసెంబర్ 16 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి క్రమం తప్పకుండా నిధులను కేటాయిస్తున్నది. మండలంలోని మక్తమాదారం సర్పంచ్, పాలకవర్గ సభ్యులు వాటిని సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. గ్రామం లో సుమారు రూ.90 లక్షల వరకు అభివృద్ధి పనులు చేపట్టా రు. ఊరిలో 389 ఇండ్లు ఉండగా 1,402 జనాభా, 1,080 మంది ఓటర్లు ఉన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామానికి
కొత్త కళ వచ్చింది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, డంపింగ్ యార్డు, ట్రాక్టర్, ట్యాంకర్‌తోపాటు సీసీ రోడ్లు, రైతువేదిక భవనాన్ని నిర్మించారు. పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ గ్రామంలోని చెత్తాచెదారాన్ని సేకరించి పంచాయతీ ట్రాక్టర్‌తో డంపింగ్ యార్డుకు తరలి స్తున్నా రు. అక్కడ సేంద్రియ ఎరువును తయారు చేసి మొక్కలకు వినియోగిస్తున్నారు. నిత్యం చెత్తను తొలగిస్తుండటంతో గ్రామం పరిశుభ్రంగా కనిపిస్తున్నది. కడ్తాల్-షాద్‌నగర్ బీటీ రోడ్డు పనులు పూర్తి కావడంతో గ్రామానికి రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతుండటంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామానికి కొత్త రూపు వచ్చింది. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.25 లక్షలతో రైతు వేదిక భవనం, రూ.2.50 లక్షలతో డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గ్రామంలో రూ.4లక్షలతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం ఆకట్టుకుంటున్నది. అందులో రెండు వేల వరకు జామ, నిమ్మ, కొబ్బరి, తులసి, వేప, బాదంతోపాటు వివిధ రకాల పూల మొక్కలను నాటారు. హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. అవి ఆ రోడ్డులో రాకపోకలు సాగించే వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పంచాయతీ ట్యాంకర్‌తో ప్రతిరోజూ హరితహారం, పల్లె ప్రకృతివనంలోని మొక్కలకు నీటిని పంచాయతీ సిబ్బంది అందిస్తున్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీటిని కుళాయిల ద్వారా అందించేందుకు రూ. 11లక్షలతో వాటర్ ట్యాంక్, రూ.4 లక్షలతో అన్ని కాలనీల్లో ఎల్ఈడీ లైట్లు, రూ.31 లక్షలతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు.
శరవేగంగా అభివృద్ధి పనులు
గ్రామంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. గ్రామాభివృద్ధికి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు.
-గణేశ్, ఉప సర్పంచ్ మక్తమాదారం గ్రామం
అందరి సహకారంతోనే..
స్థానికులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగించుకుంటు న్నాం. గ్రామసభల ద్వారా గ్రామంలో చేపట్టను న్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నా.
-రాజు, పంచాయతీ కార్యదర్శి, మక్తమాదారం గ్రామం
పల్లె ప్రగతితోనే గ్రామాభివృద్ధి..
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామం కొత్త రూపును సంతరించుకున్నది. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకుం టూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నా. ఇప్పటికే పల్లెలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, రైతువేదిక భవనం, సీసీ రోడ్లు, పల్లెప్రకృతివనం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల వం టి పలు అభివృద్ధి పనులను పూర్తి చేశాం. గ్రామాన్ని మరిం త అభివృద్ధి చేసి మండలంలోనే ఆదర్శంగా నిలుపుతా.
-సులోచన, మక్తమాదారం గ్రామ సర్పంచ్