
మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 23 : మహానగరాల సరసన మహబూబ్‌నగర్‌ను నిలుపుతామని ఎక్సై జ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు అ భివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పద్మావతి కాలనీలోని అయ్యప్ప స్వామి ఆల యం వద్ద రూ.2 కోట్లతో నిర్మించనున్న వైకుంఠ ధామానికి, భగీరథ కాలనీలో రూ.10 లక్షలతో చేపట్టనున్న ప నులకు శంకుస్థాపన, పాలకొండ వద్ద రూ.1.03 కో ట్లతో నిర్మించిన ప్రజా ఆరోగ్య కార్యనిర్వాహక ఇంజినీ ర్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంచెలంచెలుగా మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అన్ని రకాల వసతులు, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పా రు. జిల్లా కేంద్రానికి సమీపంలో బైపాస్ రహదారులు, పట్టణంలో రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, మురుగు కాల్వల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లలో పెద్ద పెద్ద మొక్కలు నాటామని పేర్కొన్నారు. గతంలో పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో పనులతో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని తెలిపారు. పట్టణంలో భూములు, ఆ స్తుల, ఇండ్ల విలువ అమాంతంగా పెరిగిందన్నారు. హై దరాబాద్‌కు దీటుగా మహబూబ్‌నగర్ పట్టణం అభివృ ద్ధి చెందుతున్నదన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఇల్లు ఉంటే చాలు అనుకునే వారని, కానీ నేడు మహబూబ్‌నగర్‌లో ఉన్నా ఒకే అని చాలామంది అంటున్నారని మంత్రి పేర్కొన్నారు. పట్టణానికి అన్ని వైపులా ప్రభుత్వ సంస్థలు, ఐటీ పార్కు ఏర్పాటు కానున్నదన్నారు. త్వరలోనే హన్వాడలో ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆహ్లాదం కోసం వార్డుల్లో పార్కులు ఏర్పాటు చేశామని వివరించారు. అంతిమ సంస్కారాల కోసం వైకుంఠ ధామాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. త్వరలో గ్యాస్ క్రిమిటోరియం ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, ఆర్డీవో పద్మశ్రీ, పబ్లిక్, హెల్త్ ఈఈ విజయభాస్కర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజినీర్ సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్లు రష్మిత, రాము, పటేల్ ప్రవీణ్, నరేందర్, కట్ట రవికిషన్‌రెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు రామలింగం, నాయకులు ప్రభాకర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.