
మిరుదొడ్డి, డిసెంబర్ 30 : సీఎం కేసీఆర్ అన్నదాతలకు పంట పెట్టుబడులు అందించి ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో రైతుల కష్టాలు తీరుతున్నాయి. దేశానికి అన్నం పెట్టే కర్షకులు కండ్లలో రైతు బంధు పథకంతో ఆనంద భాష్పాలు కనిపిస్తున్నాయి. రైతుబంధు పథకంపై సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన 46 ఏండ్ల రైతు రాజయ్య మాటల్లోనే విందాం..
ప్ర : మీకు ఎన్ని రోజుల నుంచి రైతుబంధు వస్తుంది?
జ : నా పుట్టుక నుంచి ఎన్నడు గిట్ల ఎవుసం జేసేటోళ్లకు పంటలు పండించుకోడానికి పైసలు ఇచ్చినోళ్లు ఎవరూ లేరు. మా తెలంగాణ మాకు అచ్చిన తర్వాత, సీఎం కేసీఆర్ అచ్చినంక యేటేటా నా పేరుపై రెండు, నా భార్య లక్ష్మి పేరుపై రెండు మొత్తం నాలుగు బిగా(ఎకరాలు)లకు రూ.5 వేలు సొప్పున రూ.20 వేలు అత్తున్నాయి. అచ్చే పైసలతో అప్పులు లేకుండా పంటలను పండిత్తున్నం.
ప్ర : రైతు బీమా పథకంతో మీకు ఏమి లాభం?
జ : పొద్దుగాళ్ల లేత్తెనే ఎవుసం చేసేటోళ్లం.. బాయిల కాడనే పంటలను చూసుకుంటూ ఉంటున్నాం. గాడ పురుగు..?బూషో..? కరిచి లేక, ఏదేనా మోటర్ గుద్దుకొని ఎవరైనా ఇంటి పెద్ద మనిషి సచ్చిపోతే, సీఎం కేసీఆర్ సార్ ఇచ్చే రూ.5 లచ్చలతో భార్యాపిల్లలు ఏ కష్టాలు లేకుండా గిప్పుడూ మంచిగా బతుకుతున్నారు.
ప్ర : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి?
జ : సీఎం కేసీఆర్ సార్ మా గురించి శాన పథకాలు తెచ్చిండు. గీ పథకాలతో మాకు ఎంతో మంచి జరుగుతుంది. సీఎం కేసీఆర్ దయతో మాకు ఎంతో మేలు జరుగుతుంది. మా బాధలు తీర్చుతున్న గింత మంచి సీఎం కేసీఆర్ సార్‌ను మేము ఉన్నంత వరకు మరువం.
ప్ర : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏమేమి పథకాలు ప్రవేశపెట్టింది?
జ : గా బీజేపీ ప్రభుత్వంలో మోదీ సార్ రైతులకు ఏమి సేత్తలేడు.. బోరు బాయిల కాడ మీటర్లు పెడుతాడటా కదా? గిప్పుడు యాసంగిలో పండిచ్చే అడ్లను కొంట లేరు.. మేము రైతులందరం ఎట్లా బతుకాలే.. సీఎం కేసీఆర్ సార్ అడ్లను కొనుమంటే గా బీజేపొల్లు కొనక పోవడంతో మేము ఏదో ఒక్క పంటను పెట్టుకుంటున్నాం. మా కోసం కష్టపడుతూ కష్టాలను తీర్చుతున్న సీఎం కేసీఆర్ బాగుండాలని భగవంతున్ని కోరుతున్నాం.
మొదటి నుంచి పైసలు వస్తున్నయ్ ..
సీఎం కేసీఆర్ సారూ ఎల్లప్పుడు సల్లంగా ఉండాలె. మాలాంటి గరిబోళ్లకు అండగా ఉంటున్నారు. నా పేరు మీది ఎకరం, మా ఆయన పేరు మీద ఎకరన్నర భూమి ఉన్నది. రైతుబంధు మొదలు పెట్టిన్నప్పటి నుంచి ఈ పైసల్ మాకు(భర్తకు, తనకు) వస్తున్నయ్. ఇప్పటికి సుమారు నాలుగేండ్ల నుంచి ఎనిమిది సార్లు ఎకరాకు రూ. 5 వేలు వస్తున్నయ్. చాలా సంతోషంగా ఉన్నది. పెట్టుబడి కోసం రందీ లేకుండా అయ్యింది. పొలం దున్నే ట్రాక్టరోళ్లకు చెప్పిన కేసీఆర్ ఫైసల్ వచ్చిన వెంట డీజిల్‌కు ఇత్త కానీ పొలం దున్నలనీ. అయితే ఈ సారి కొంత మక్కజొన్న, పొద్దుతిరుగుడు వేసినం. ఇంత తిండి కోసం సన్నవడ్ల వరి వేస్తున్నాం.
లకావత్ హస్లీ, బండమీదితండా (అక్కన్నపేట)
ఎవుసం కోసం రూపాయి ఏవలూ ఇయ్యలేదు..
బతికినంత కాలం సర్కారుకు రుణపడి ఉంటాం. ఎవుసం కోసం ఇన్నాళ్లు ఏవలూ ఒక్క రూపాయి ఇయ్యలేదు. కేసీఆర్ సారూ పుణ్యామనీ ఎకరాకు రూ. 5 వేలు ఇచ్చి రైతులకు ఆదుకుంటుడు. అంతకుముందు ఎవుసం చేయలంటే పెట్టుబడి కోసం షావుకారికి వెళ్లి అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టి పంటలు పండించి అప్పులు కట్టి మిగులుతే బతికేది. ఎందుకీ ఈ ఎవుసం చేయాలేనిపించేది. కరెంటు ఉండదు. నీళ్లు సరిగా లేవు, పిండిబత్తలు దొరకవు, మద్ధ్దతు ధర లేదు అరిగోస పడేది. ఎవుసం బంద్ చేసి నాలుగేండ్లు కరీంనగర్‌కు వెళ్లి రిక్షా తొక్కిన. 2015 నుంచి మళ్లీ తండాకు వచ్చి ఎవుసం చేస్తున్న మంచిగా అరుకతి, బరుకతి ఉంది. మా తండా తరఫున పెద్దసార్ కు రాంరాం..