
కొల్చారం, జనవరి 2 : ప్రతి జీవిలో దైవాన్ని చూడడం హిందూమతం గొప్పతనమని మధనానంద ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి అన్నారు. మండలంలోని రంగంపేట శివారులోని మధనానంద ఆశ్రమంలో మూడు రోజులుగా జరుగుతున్న కృష్ణానంద సరస్వతీ ఆరోధనోత్సవాల్లో ఆదివారం మాధవానంద సరస్వతీ స్వామి దర్బార్ నిర్వహించారు. ఆరాధనోత్సవాలకు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరస్వతీ స్వామి, నాచారం ఆశ్రమ పీఠాధిపతి మధుసూదన్ ఆనంద సరస్వతీ ఆధ్వర్యంలో ఆశ్రమంలో పూజలు నిర్వహించారు. అనంతరం మాధవానంద సరస్వతీ స్వామి దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ విజయ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, రంగంపేట్, తుక్కాపూర్, సంగాయిపేట సర్పంచ్‌లు బండి సుజాత, మాధవి, మానస, హవేళీఘణపూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, తెలంగాణ ముదిరాజ్ సంఘం కార్యదర్శి పుట్టి అక్షయ్, కనకయ్య, మహిపాల్‌రెడ్డి, యామిరెడ్డి, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, సాయాగౌడ్, శ్రీనునాయక్, ఎంపీటీసీలు చిట్యాల శ్రీనివాస్, సిద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.