
మెదక్, జనవరి 2 : కొత్తమీర సాగుతో ఆ ఊర్లో రైతులు అధిక లాభాలను అర్జిస్తున్నారు. జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామం పేరు చెబితే ఎవరూ పెద్దగా గుర్తు పట్టరు. కానీ, కొత్తిమీర సాగు చేసే గ్రామం అంటే మాత్రం ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. కొత్తిమీర సాగుతో ఆ గ్రామానికి అంతటి గుర్తింపు వచ్చింది. ఆ గ్రామం పేరే గుట్టకిందిపల్లి. మెదక్ మండలం గుట్టకిందిపల్లిలో సుమారు 752 మంది జనాభా ఉండగా, 210 ఇండ్లు ఉన్నాయి. ఈ ఊర్లో సాగు విస్తీర్ణం కూడా తక్కువే. దీంతో రైతులు సాంప్రదాయ పంటలను కాకుం డా ఇతర పంటలపై రైతులు దృష్టి పెట్టారు. అందులో భాగంగా తక్కువ విస్తీర్ణంలో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే కూరగాయ పంటలను పండించడంలో నిమగ్నమయ్యారు. నిత్యం డిమాండ్ ఉండే కూరగాయలు, ఆకు కూరల సాగు చేస్తూ ఆదాయం గడిస్తున్నారు. మామూలు కూరగాయల సాగుకంటే గుట్టకిందిపల్లి గ్రామస్తులంతా ప్రత్యేకంగా కొత్తమీర సాగు చేస్తుండడం విశేషం. ఊరు ఊరంతా లాభదాయకంగా ఉన్న కొత్తిమీర సాగువైపు మళ్లడంతో ఇప్పుడు ఆ ఊరు కొత్తిమీర సాగుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. గ్రామానికి చెందిన గొల్ల మల్లేశం అర ఎకరం పొలంలో కొత్తిమీర పంట సాగు చేస్తే పెట్టుబడికి రూ.25వేలు కాగా, రూ.50వేల వరకు లాభం వచ్చిందని తెలిపాడు. అదే విధంగా గొల్ల సాయిలు 6 గుంటల పొలంలో కొత్తిమీర పంట సాగు చేస్తే రూ.9500 పెట్టుబడి పెట్టగా, రూ.20వేలు వరకు ఆదాయం వచ్చిందని చెప్పాడు.
సీజనల్ పంటలతో అధిక ఆదాయం..
సీజన్‌కు అనుగుణంగా గుట్టకిందిపల్లి గ్రామస్తులు కొత్తిమీర పంటలు వేసుకొని లాభాలు అర్జిస్తున్నారు. ముఖ్యంగా యువత కూరగాయలు, ఆకుకూరల సాగుపై దృష్టి సారించి నిత్యం లాభాలు గడిస్తున్నారు. మెదక్ పట్టణానికి రైతులే స్వయంగా ఆకుకూరలు, కూరగాయలను తీసుకువచ్చి అమ్ముతుంటారు. దళారులకు కాకుండా రైతులే సొంతంగా అమ్మకాలు సాగిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. రసాయనిక ఎరువులను తగ్గించి, సేంద్రియ ఎరువులను వినియోగించి ఆకు కూరలను సాగు చేయడంతో వీరి పంటకు మంచి ఆదరణ లభిస్తున్నది.
తక్కువ శ్రమ.. లాభాలు ఎక్కువ ..
వరి, ఇతర పంటలకు ఎక్కువగా నీటిని వినియోగించాల్సి వస్తుంది. పంట వేసినప్పటి నుంచి చీడపీడల బాధ కూడా ఎక్కువే. కానీ, తక్కువ నీటితో పాటు పెద్దగా చీడపీడల బాధ లేకుండా కొత్తమీర పంటను సాగు చేస్తున్నారు గుట్టకిందిపల్లి గ్రామస్తులు. పొలాల్లోనే కాదు ఇంటి పెరట్లో కూడా ఖాళీగా స్థలం ఉంటే చాలు కొత్తమీరతో పాటు కూరగాయలు సాగు చేసుకుంటూ నిత్యం ఆదాయం అర్జిస్తున్నారు. ప్రతిరోజూ దగ్గరలోనే ఉన్న మెదక్ మార్కెట్, హైదరాబాద్‌కు కొత్తమీరను సరఫరా చేస్తున్నారు. సీజన్లోనే ఒక్కో మడికి రూ.75వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. ఖర్చులు తక్కువ రాబడి అధికంగా ఉన్న కొత్తిమీర, కూరగాయల సాగుపై ఇప్పుడు చుట్టు పక్కల గ్రామాల వారు కూడా దృష్టి సారించడం విశేషం. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండడంతో నిత్యం కూరగాయలకు, కొత్తమీరకు మంచి డిమాండ్ ఉంటుంది.
కొత్తిమీరతో లాభాలు..
మా భూమిలో తప్పనిసరిగా కొత్తిమీర సాగు చేస్తుం టాం. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువగా వస్తుం ది. పండించిన కొత్తిమీర పంటను మేమే అమ్ముకోవడం వల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఇంటిల్లిపాది పొలంలో పనిచేసుకొని పండిన పం టను స్వయంగా అమ్ముతున్నాం.
ఆరు గుంటల్లో.. రూ.20వేల ఆదాయం..
నేను ఆరు గుంటల పొ లంలో కొత్తిమీర పంట సాగు చేస్తే రూ.9,500 పెట్టుబడి అయ్యింది. అన్ని ఖర్చులు పోనూ రూ.20 వేలు వరకు ఆదాయం వచ్చింది. కొత్తిమీర పంటతో పాటు కూరగాయల పంటలను కూడా సాగు చేస్తున్నా. రోజూ ఏదో ఓ సంతకు వెళ్లి కొత్తిమీర, కూరగాయలను అమ్ముతున్న. లాభం బాగానే వస్తుంది.
సీజనల్ పంటలతో అధిక ఆదాయం..
సీజన్‌కు అనుగుణంగా గుట్టకిందిపల్లి గ్రామస్తులు కొత్తిమీర పం టలు వేసుకొని లాభాలు అర్జిస్తున్నారు. ముఖ్యంగా యువత కూరగాయలు, ఆకుకూరల సాగుపై దృష్టి సారించి నిత్యం లాభాలు గడిస్తున్నారు. మెదక్ పట్టణానికి రైతులే స్వయంగా ఆకుకూరలు, కూరగాయలను తీసుకువచ్చి అమ్ముతుంటారు. దళారులకు కాకుండా రైతులే సొంతంగా అమ్మకాలు సాగిస్తూ అధిక ఆదా యం పొందుతున్నారు. రసాయనిక ఎరువులను తగ్గించి, సేంద్రియ ఎరువులను వినియోగించి ఆకు కూరలను సాగు చేయడంతో వీరి పం టకు మంచి ఆదరణ లభిస్తున్నది.