కందుకూరు : కందుకూరు మండలం బాచుపల్లి గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టాక మహోత్సవానికి జిల్లాకు చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు హాజరవ్వడంతో సందడి నెలకొంది. బుధవారం జరిగిన కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, వైఎస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌రెడ్డి లు హాజరయ్యారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నాయకులు దేప బాస్కర్‌రెడ్డి , జిల్లాపరిషత్ మాజీ ఫ్లోర్ లీడరు ఏనుగు జంగారెడ్డి, ఢీల్లి శ్రీధర్, మూల హన్మంత్‌రెడ్డి, అందుగుల సత్యనారాయణ,బొక్క భూపాల్‌రెడ్డిలతో పాటు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు హజరయ్యారు. వీరిని నిర్వహకులు శాలువాలు, పూలమాలతో ఘనంగా జన్మానించారు.