
మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 22 : మహబూబ్‌నగర్ పట్టణాభివృద్ధిలో అంద రూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చై ర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. బుధవా రం మున్సిపల్ కార్యాలయ సమావేశమందిరంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం లో మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ను అన్నివిధాలా తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రధాన రోడ్డు విస్తరణ, జంక్షన్ల అ భివృద్ధి పనులు చేపట్టడంతోపాటు రోడ్డు సెంట్రల్ లైన్లో మొక్కలు నాటడంతో మహబూబ్‌నగర్ హరితకళను సంతరించుకున్నదని తెలిపారు. మంత్రి సహకారంతో వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఎక్కడైనా తాగునీటి సమ స్య ఏర్పడితే అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు. సమస్యలను తెలియజేసేందుకు కౌన్సిలర్లు ఫోన్ చేస్తే కొందరు అధికారులు స్పందించకపోవడం సరికాదన్నారు. అనంతరం పలువురు కౌన్సిల ర్లు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. పెండింగ్ సమస్యలను పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని 3వ వార్డు కౌన్సిలర్ రామాంజనేయులు కోరారు. అలాగే వార్డుల్లో తాగునీటి సమస్య ఉందని, కాలనీల్లో పవర్‌బోర్లు అందుబాటులోకి తే వాలని కౌన్సిలర్లు యాదమ్మ, నర్సింహులు తెలిపారు. పార్కుల్లో వాచ్మెన్ ఏర్పాటు చేయడంతోపాటు మున్సిపల్ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని కౌన్సిలర్ పటేల్ ప్రవీణ్ కోరారు. అన్ని కాలనీల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు షేక్ఉమర్, గోవిందు తెలిపారు. కౌన్సిలర్లు కట్టా రవికిషన్‌రెడ్డి, పద్మ, సాదతుల్లాహుస్సేనీ, చెన్నవీరయ్య, అనంతరెడ్డి, ము స్తాక్ తదితరులు పలు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ తాటి గణేశ్, కమిషనర్ ప్రదీప్‌కుమార్ తదితరులు ఉన్నారు.