మల్కాజిగిరి, నవంబర్ 27: దవాఖానలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మల్కాజిగిరిలోని జిల్లా దవాఖానను ఆయన పరిశీలించి.. వైద్యులను సమస్యలు అడిగి తెలుసుకుని .. వైద్య పరి కరాలకు రూ.9.5లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా దవాఖానలో ప్రైవేటు దవాఖానలకు దీటుగా ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. దవాఖానలో 24గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాక్సిన్ వేస్తున్నామని అన్నారు. వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వడా నికి ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సిన్ ఇస్తున్నారని అన్నారు. వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దని, అనుమానాలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. ఇప్పటికే దాదాపు 90శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశామని, మిగిలిన వారికి వచ్చేనెల మొదటి వారం వరకు పూర్తిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు ప్రసాద్, శ్రీనివాస్, స్వరూప్, టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్‌కుమార్, జగదీశ్‌గౌడ్, రాము యాదవ్, మోహన్‌రెడ్డి, సంతోశ్రాందాస్, నర్సింగ్, ప్రసాద్యా దవ్, తదితరులు పాల్గొన్నారు.