ఎల్బీనగర్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో చైతన్యపురిలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కేక్ కట్ చేయించిన విఠల్‌రెడ్డి అనంతరం చైతన్యపురిలో పలు కార్యక్రమాలను నిర్వహించారు.
ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ కనకదుర్గా దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టారు. చైతన్యపురిలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. ప్రభాత్‌నగర్ పార్కులో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పవన్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ త్రివేది, పోచిరెడ్డి, రమణారెడ్డి, మహిళా నాయకురాళ్లు సంగీత, అనిత, నాయకులు తిరుమల్ఱెడ్డి, విజయరంగా, ప్రభాకర్‌రావు, వీరన్న యాదవ్, జాఫర్, అంజయ్య, అప్పారావు, నాగరాజు, శ్రీకాంత్, నరహారి, కృష్ణమూర్తి, పూర్ణచందర్రావు, మల్లారెడ్డి, నిరంజన్, వెంకట్‌రెడ్డి, చక్రి తదితరులు పాల్గొన్నారు.