అడ్డగుట్ట : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన అవార్డు గ్రహీత సుధారాణి బుధవారం తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను మార్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుధారాణి చేస్తున్న సామాజిక సేవ, యువతరాన్ని మేలుకొలుపేందుకు అందిస్తున్న అవగాహన కార్యక్రమాలను మంత్రి అభినందించారు. అనంతరం సుధారాణిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ శాలువాతో ఘనంగా సత్కరించారు.