Double Bedroom Houses | డబుల్ గృహాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు పట్ల మంత్రి కేటీఆర్ అభినందనలు

ఖైరతాబాద్ : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో హైదరాబాద్ మహానగర పరిధిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూం గృహాల నిర్మాణాలు యజ్ఞంలా సాగుతున్నది. ఇటీవల స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో జరిగిన స్మార్ట్ సిటీ ఎక్స్ఫో వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రపంచ స్థాయిలో డబుల్ గృహాల పథకం ఫైనలిస్ట్ అవార్డు పొందిన విషయం విదితమే.
ఈ అరుదైన అవార్డును దక్కించుకున్న నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హౌజింగ్ ఓఎస్డీ డి. సురేశ్ కుమార్, ఇతర హౌజింగ్ అధికారులను అభినందించారు.

త్వరలో ఖైరతాబాద్‌లో డబుల్ గృహ ప్రవేశాలు
ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో రూ.17.85 కోట్ల వ్యయంతో నిర్మించిన 210 ఇండ్లలో లబ్ధిదారులు త్వరలోనే గృహ ప్రవేశాలు చేయనున్నారు. సిల్ట్ + 5 అంతస్తులతో నాలుగు బ్లాకుల్లో 2,556 గజాలలో నిర్మాణమైన ఈ గృహాలు సకల హంగులు సంతరించుకున్నాయి. సీసీ రోడ్డు, తాగునీరు, డ్రైనేజీ, లిఫ్టులు, షాపింగ్ కాంప్లెక్సులు, పచ్చని మొక్కలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

